బంగారం ధరలు జంప్: వెండి ఒక్కసారిగా రూ. 10,000లకు పైగా.. !!

జనవరిలో రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విధాన నిర్ణయాలు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అస్థిరత, ప్రపంచ మార్కెట్ పరిణామాలు.. కొనుగోలుదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. అయోమయానికి, గందరగోళానికి దారి తీస్తోన్నాయి. అధిక స్థాయిలలో లాభాల స్వీకరణ కారణంగా ధరలు పడిపోతోండటం కొనాలా? వద్దా అనే డోలాయమాన పరిస్థితులకు తెర తీశాయి.

నేడు ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ధర 2,500 రూపాయల మేర పెరిగింది. క్రితం క్లోజింగ్ తో పోల్చుకుంటే 1.61 శాతం మేర ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,57,951 రూపాయలను దాటింది. అదే సమయంలో వెండిధర కూడా ఒక్కసారిగా పెరిగింది. 10,000 రూపాయల మేర తేడా కనిపించింది. కిలో 2,63,828 రూపాయలుగా నమోదైంది.


Gold Rates Jump on Multy Comodity Exchange Cross Rs 1 57 Lakh per 10g as Silver Surges 10000 Per KG

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930కి, 22 క్యారెట్లు రూ. 1,44,050కి చేరుకుంది. స్పాట్ మార్కెట్‌లో మాత్రం కిలో వెండి ధర రూ. 2,65,500కి తగ్గింది. ఢిల్లీ, జైపూర్ లలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,44,200, 24 క్యారెట్లు రూ. 1,57,070. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,44,100, 24 క్యారెట్లు రూ. 1,56,970గా ఉన్నాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,44,050, 24 క్యారెట్లు రూ.1,56,930గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,982, 22 క్యారెట్లు - రూ. 14,650, 18 క్యారెట్లు - రూ. 12,520

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,884, 22 క్యారెట్లు- రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 11,913

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,884, 22 క్యారెట్లు- రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 11,913

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,884, 22 క్యారెట్లు- రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 11,913

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,884, 22 క్యారెట్లు- రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 11,913

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,884, 22 క్యారెట్లు- రూ. 14,560, 18 క్యారెట్లు - రూ. 11,913

Credit: Oneindia

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+