బంగారం ధరలకు పూర్వవైభవం
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటోన్నాయి. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, అనిశ్చితుల మధ్య బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), బులియన్ మార్కెట్లలో ధరల్లో భారీ కదలిక కనిపించింది. పసిడి ధరల పెరుగుదలకు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం అయ్యాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే వార్తలు పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి.
దీంతో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారడంతో డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ వెబ్‌సైట్ ప్రకారం నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,57,380 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,44,265 రూపాయలు పలుకుతోంది. 999 స్వచ్ఛమైన వెండి కిలోకు 2,53,230 కు చేరింది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. బంగారంలో రూ. 3,000 వరకు పెరుగుదల రికార్డయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,015, 22 క్యారెట్లు - రూ. 14,680, 18 క్యారెట్లు - రూ. 12,560
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,928, 22 క్యారెట్లు- రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 11,946
Credit: Oneindia

Click it and Unblock the Notifications