ఒక్కసారే పెట్టుబడి..జీవితాంతం ఫ్రీ జర్నీ.. స్కూటర్ ఫీచర్లతో ఫెడల్ తొక్కకుండా 40కిమీ వెళ్లే సైకిల్ వచ్చేసింది

భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ఊపందుకుంటున్న తరుణంలో దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ అయిన ఎమోటోరాడ్ (EMotorad) ఒక విప్లవాత్మక మోడల్‌ను విడుదల చేసింది. అదే టి-రెక్స్ స్మార్ట్(T-Rex Smart). ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్, దైనందిన ప్రయాణాలను మరింత సులభతరం చేయడంతో పాటు, టెక్నాలజీ, క్వాలిటీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ముఖ్యంగా బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీతో మార్కెట్‌లోకి వచ్చిన భారతదేశపు మొట్టమొదటి ఈ-సైకిల్ ఇదే. స్పీడుతో పాటు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఆధునిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని టి-రెక్స్ స్మార్ట్ను అభివృద్ధి చేశారు.

ఎమోటోరాడ్ T-Rex స్మార్ట్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్, కేవలం బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉండి రూ.37,999 ధరతో లభిస్తుంది. ఇక రెండవ వేరియంట్ అయితే బ్లూటూత్‌తో పాటు అత్యాధునిక జీపీఎస్ కనెక్టివిటీని కూడా కలిగి ఉండి రూ.45,999 ధరతో సొంతం చేసుకోవచ్చు. ధరలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఈ రెండు మోడళ్లు భారతీయ రోడ్లకు అనుకూలమైన బిల్డ్ క్వాలిటీని, మైలేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

EMotorad T-Rex Smart Indias First Smart E-Cycle with Bluetooth and GPS Connectivity Launched

ఈ స్మార్ట్ ఈ-సైకిల్ అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి, దీనిని ఎమోటోరాడ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన అమిగో నెక్స్ట్(AMIIGO NXT) మొబైల్ యాప్‌తో సజావుగా అనుసంధానించడం. ఆండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్లలో లభించే ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ట్రిప్ హిస్టరీని తనిఖీ చేయవచ్చు, ప్రయాణాలను రియల్ టైంలో పర్యవేక్షించవచ్చు. సైకిల్ పనితీరును అంచనా వేయవచ్చు. ఈ యాప్ ఒక స్మార్ట్ ఈ-సైకిల్ ఎకోసిస్టమ్‌ను నిర్మించే లక్ష్యంతో రూపొందించారు.

AMIIGO NXT యాప్‌లో పొందుపరిచిన స్మార్ట్ ఫీచర్లు రైడర్‌కు మెరుగైన సేఫ్టీ, కంట్రోల్ను అందిస్తాయి. జియోఫెన్స్ (Geofence) సిస్టమ్ ద్వారా ప్రయాణించే మార్గాన్ని లేదా సురక్షిత ప్రాంతాన్ని ముందుగా నిర్ణయించుకోవచ్చు. అత్యంత కీలకమైన ఫీచర్లలో ఒకటైన చైల్డ్ లాక్, త్రోటల్ వేగాన్ని కంట్రోల్ చేస్తుంది, తద్వారా పిల్లలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

EMotorad T-Rex Smart Indias First Smart E-Cycle with Bluetooth and GPS Connectivity Launched

ఈ సైకిల్‌లో పొందుపరిచిన మరికొన్ని నిఘా, భద్రతా ఫీచర్లు: యాంటీ-థెఫ్ట్ అలారం (దొంగతనం నిరోధక అలారం), రిమోట్ ఇమ్మొబిలైజర్ , అత్యవసర సమయాల్లో ఉపయోగపడే SOS కాల్ సౌకర్యం.

T-Rex స్మార్ట్ డిజైన్, ఇంజనీరింగ్ చాలా పటిష్టంగా ఉన్నాయి. ఇది హై క్వాలిటీ టెన్సైల్ స్టీల్‌తో తయారు చేయబడిన హార్డ్‌టైల్ ఎమ్‌టీబీ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. దీనికి 36V, 250W మోటార్ రియర్ వీల్‌పై అమర్చబడి శక్తిని అందిస్తుంది. పవర్‌ను 36V, 10.2Ah లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. రేంజ్ పరంగా ఈ సైకిల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. త్రోటల్ మాత్రమే ఉపయోగించి సింగిల్ ఛార్జ్‌పై 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

EMotorad T-Rex Smart Indias First Smart E-Cycle with Bluetooth and GPS Connectivity Launched

ఈ ఈ-సైకిల్‌లో హ్యాండిల్‌బార్‌పై క్లస్టర్ C5 డిజిటల్ డిస్‌ప్లే, షిమానో TY300 7-స్పీడ్ డ్రైవ్ ట్రైన్, 5 పెడల్ అసిస్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. 29' × 2.4' సైజు ఉన్న పంచర్-లెస్ నైలాన్ టైర్లు, 100 mm ఫ్రంట్ ఫోర్క్ రోడ్డుపై ఉన్న ఎగుడుదిగుడులను సులభంగా అధిగమించేందుకు సహాయపడతాయి.

సేఫ్టీ కోసం ఆటో కట్-ఆఫ్ ఫీచర్‌తో కూడిన మెకానికల్ డిస్క్ బ్రేక్‌లు అమర్చబడ్డాయి. దైనందిన వినియోగానికి అనుకూలంగా ఫుల్-మెటల్ మడ్‌గార్డ్‌లు, రియర్-వ్యూ మిర్రర్‌లు, మొబైల్ ఫోన్ హోల్డర్, హారన్‌తో కూడిన హెడ్‌లైట్, వెనుక స్టోరేజ్ బాక్స్ వంటి అనేక అదనపు ఫీచర్లతో T-Rex స్మార్ట్ ఈ-సైకిల్ లభిస్తుంది.

Credit: Drivespark

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+