భారత్ కు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీపికబురు వినిపించారు. భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించిన 25 శాతం అదనపు టారిఫ్ ను రద్దు చేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. రష్యా నుండి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోండటం పట్ల అదనంగా విధించిన టారిఫ్ అది. ఈ ఒక్క సంతకంతో.. 25 శాతం అదనపు భారం భారత దిగుమతులపై తగ్గినట్టయింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి రానుంది. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది.
దీంతో పాటు దాదాపు ఏడాదికాలంగా భారత్- అమెరికా మధ్య నానుతూ వస్తోన్న వాణిజ్య ఒప్పందాల కథ కూడా సుఖాంతమైంది. ఈ ఉద్రిక్తతలకు కూడా తెరదించారు డొనాల్డ్ ట్రంప్. భారత్- అమెరికా మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వచ్చిన ట్రేడ్ అగ్రిమెంట్స్ కొద్ది రోజుల క్రితమే ఖరారు అయ్యాయి. ఈ కీలక నిర్ణయం- ఇరు దేశాల సంబంధాలలో కొత్త మలుపు తీసుకుంది.

రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందిస్తోందంటూ గతంలో ట్రంప్ పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కొనుగోళ్లు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలకు పరోక్షంగా మద్దతునిస్తున్నాయని ఆయన వాదించారు. అప్పట్లో యూరప్, అమెరికా కూడా రష్యా చమురును కొనుగోలు చేశాయి. దీనికి ప్రతిగా భారతీయ దిగుమతులపై 25 శాతం అదనపు టారిఫ్ ను విధించారాయన. ఇది ఆ దేశ మార్కెట్‌లో భారతీయ వస్తువుల ఖర్చును గణనీయంగా పెంచింది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ ముడి చమురు కొనుగోళ్లపై విభేదాలతో దెబ్బతిన్న ఆర్థిక సంబంధాలను ఇది పునరుద్ధరిస్తూ, భారతీయ ఎగుమతిదారులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా భారత వస్తువులపై పరస్పర సుంకాలను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గుతుంది. అమలు తేదీ ఇంకా ఖరారు కాలేదు. దీనిపై వైట్ హౌస్ ఓ జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేసింది కూడా. రాబోయే అయిదేళ్లలో 500 బిలియన్ డాలర్ల అమెరికన్ ఇంధనం, విమానాలు, విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కుకింగ్ కోల్‌ను కొనుగోలు చేయనుంది.
Credit: Oneindia
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications