కేంద్ర బడ్జెట్ 2026-27 ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక సరికొత్త ఊపిరిని ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి ఈవీ కార్లను మరింత చౌకగా అందించడమే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచ ఈవీ హబ్‌గా మార్చేందుకు బలమైన పునాదులు వేశారు. కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాకుండా, ముడి పదార్థాల లభ్యత కోసం ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లను ప్రకటించడం విశేషం.
భారతదేశంలో ఎలెక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి ప్రధాన అడ్డంకి వాటి భారీ ధర. సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ధర 30-40 శాతం ఎక్కువగా ఉండటానికి కారణం అందులో వాడే బ్యాటరీలే. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. లిథియం-అయాన్ సెల్స్ తయారీకి అవసరమైన యంత్రాలు, ముడి పదార్థాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) నుంచి మినహాయింపును మార్చి 2028 వరకు పొడిగించారు. దీనివల్ల కంపెనీలకు తయారీ ఖర్చు తగ్గి, ఆ లాభాన్ని వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది.

బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల ప్రాసెసింగ్ కోసం వాడే పరికరాలపై దిగుమతి పన్నును ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ప్రస్తుతం ఒక ఈవీ కారు ధరలో దాదాపు 40 శాతం వాటా బ్యాటరీదే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ పన్ను మినహాయింపుల వల్ల బ్యాటరీ ప్యాక్‌ల ధర తగ్గి, కారు మొత్తం ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మినహాయింపులు దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల కంపెనీలు మన దేశంలోనే సొంతంగా బ్యాటరీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయి.
ముడి పదార్థాల కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 'రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లను' ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ కారిడార్ల ద్వారా ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ , తయారీ అంతా ఒకే చోట జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో లభించే ఖనిజాలను బ్యాటరీ తయారీకి వాడుకోవడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీనికోసం సుమారు రూ.7,280 కోట్లతో కూడిన ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఆధునిక కార్లంటేనే చిప్స్ (సెమీకండక్టర్లు). ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కోసం ప్రభుత్వం కేటాయింపులను రూ.22,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచింది. దీనివల్ల కార్ల తయారీలో ఆలస్యం తప్పుతుంది. అంతేకాకుండా, ప్రజారవాణాను మరింత గ్రీన్ గా మార్చడానికి తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల కోసం 4,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. అయితే, పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లపై జీఎస్టీని తగ్గించాలని ఆశించిన వారికి మాత్రం కొంత నిరాశ ఎదురైంది.
మొత్తానికి బడ్జెట్ 2026, ఎలెక్ట్రిక్ వాహనాల రంగానికి ఒక కొత్త దిశను చూపింది. కేవలం వినియోగదారులకు నేరుగా సబ్సిడీలు ఇవ్వడం కంటే, తయారీ ఖర్చును తగ్గించేలా పన్నులు సవరించడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం ఉంటుంది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఈ నిర్ణయాలను స్వాగతించాయి. రాబోయే పండుగ సీజన్ నాటికి ఈవీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఎలెక్ట్రిక్ కారు వైపు చూడటానికి ఇదే సరైన సమయం.
Credit: Drivespark
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications