భారత్ బంద్ కు పలు సంఘాలు నిర్ణయించాయి. రేపు (గురువారం) భారత్ బంద్ నిర్వహించాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా వ్యవస్థ నిలిచి పోనుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. లేబర్ యాక్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా బంద్ కు నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక - రైతు సంఘాలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల పైన ప్రభావం పడే అవకాశం ఉంది. విద్యా సంస్థల పైనా బంద్ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఆ సంఘం కన్వీనర్ హన్నన్ మొల్లా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా నేర్పరితనానికి భారత ప్రభుత్వం లొంగిపోయిందని ఆయన ఆరోపించారు.
జగన్ భద్రతా లోపాలపై విచారణ, కేంద్రం హోం శాఖకు నేరుగా..!!

ఈ నెల 12న జరగను న్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని వామపక పార్టీల నేతలు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు 3 లేబర్కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ - చట్టం- 2025, వీబీజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐసీలో 100శాతం విదేశీ పెట్టు బడులకు అనుమతించడం వంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.
రాసి పెట్టుకోండి.. అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే, 2028లో కాదు
నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ
తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు.. కార్మిక, విద్యార్థి అనుబంధం సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం ఆరోపించారు. కార్మికుల నడ్డివిరిచే దుర్మార్గమైన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 12న నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బ్యాంకు ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. దీంతో, బ్యాంకింగ్ సేవల పైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక.. పరీక్షల సమయం కావటంతో విద్యా సంస్థల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది.
Credit: Oneindia
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications