నీ కూతురిని బెడ్‌రూంకి పంపిస్తావా... అమ్మకి డైరెక్టర్ వేధింపులు.. హీరోయిన్ సంచలనం

సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్‌పై నిత్యం ఎవరో ఒక హీరోయిన్, మహిళా నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సినీ పరిశ్రమలో పైకి పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారి చీకటి కోణాలను పలువురు బహిర్గం చేశారు. తాజాగా ఓ నటి తన జీవితంలో ఎదురైన అనుభవాలను, సినీ రంగంలో ఇబ్బందులను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...

Euphoria Day 1 Collections: యుఫోరియా తొలిరోజు కలెక్షన్స్... గుణశేఖర్ మూవీకి బాక్సాఫీస్ పరిస్ధితేంటీ?

పేరు చివర తోకలు కత్తిరింపు
మలయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు కని కుశ్రుతి. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులకు తొలి నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండటంతో కులాన్ని సూచించే ఇంటి పేరును తొలగించుకున్నారు. తల్లిదండ్రుల పెంపకం, ఇంట్లో పరిస్ధితుల కారణంగా చిన్నప్పటి నుంచే అన్ని విషయాల్లో రాటుదేలారు కని. కాన్వెంట్‌కి పంపే స్థోమత ఉన్నప్పటికీ ఆమెను తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూల్‌లోనే చదివించారు. అయితే ఓ సారి కాన్వెంట్‌కి వెళ్లిన కని.. అక్కడి సదుపాయాలు చూసి నన్నెందుకు ఆ స్కూల్‌లో చేర్చలేదని తల్లిదండ్రులను అడిగిందట. సామాన్యులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటారు.. నువ్వు కూడా సామాన్యురాలివేనని చెప్పడంతో ఆ పాఠశాల నుంచే ప్రపంచాన్ని కొత్తగా చూడటం ప్రారంభించింది కని.


Assi Actor Kani Kusruti Opens Up on Casting Couch in Film Industry

విలక్షణ నటిగా గుర్తింపు
చదువు తర్వాత అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్‌లో చేరి అక్కడే పనిచేయడంతో పాటు నటనలో ఓనమాలు నేర్చుకుంది. ఈ క్రమంలోనే మనుష్యపుత్రి అనే మలయాళ సినిమాతో కని వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కేరళ కేఫ్, బిర్యానీ, ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్స్, గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ తదితర సినిమాలతో అవార్డులను, రివార్డులను గెలుచుకున్నారు కని కుశ్రుతి. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ మూవీలో విలన్‌కు తల్లిగా నటించారు.

చేతబడులు నిజమే.. ఆ రోజున నా శరీరంలో వింత మార్పులు... బిగ్‌బాస్ బ్యూటీ కామెంట్స్

లైంగిక వేధింపులతో నటనకు బ్రేక్
తాజాగా ఆమె హిందీలో అస్సీ అనే చిత్రంలో నటించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను లీడ్ రోల్ పోషించారు. ఇందులో ఆమె న్యాయవాదిగా నటిస్తున్నారు. నసీరుద్దీన్ షా, రేవతి, కని కుశృతి, మనోజ్ పహ్వాలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అయితే తన నట జీవితంలో మంచి దూకుడు మీదున్న దశలో పలుమార్లు కని సినిమాలకు బ్రేక్ చెప్పడం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. లైంగిక వేధింపుల కారణంగానే తను సినీ రంగానికి దూరమైనట్లు కని పలు సందర్భాలలో బయటపెట్టారు. కొద్దిరోజుల క్రితం ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కని కుశృతి.. ఇండస్ట్రీలోని చీకటి కోణాలను, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు.

Nari Nari Naduma Murari Closing Collections: నారీ నారీ నడుమ మురారి క్లోజింగ్ కలెక్షన్లు.. లాభమెంత? నష్టమెంత?

కమిట్‌మెంట్ ఇస్తేనే
సినీ పరిశ్రమలో మంచి నటిని అని పేరు తెచ్చుకోవాలని అనుకునే దానిని.. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే అది అంత తేలిక కాదని అర్ధమైంది. ఇక్కడ అవకాశాలు దక్కాలంటే కొందరు దర్శక నిర్మాతలకు కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని.. ఆ సుఖం ఇస్తేనే అవకాశాలు ఇస్తామని చెప్పేవారు. ఇలాంటి ఒత్తుళ్లు.. నటిగా మనల్ని మనం నిరూపించుకునే అవకాశాలు ఉండేవి కాదు. నా దగ్గర మాట్లాడటానికి ఇబ్బందిపడేవాళ్లు.. నేరుగా మా అమ్మని కలిసి కమిట్‌మెంట్ గురించి అడిగేవారు. నీ కూతురికి అవకాశాలు కావాలంటే ఆమె కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని కరాఖండీగా చెప్పేవారు. ఇలాంటి వేధింపులు తట్టుకోలేక కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాను. అయితే కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది అని కని కుశృతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి.

Credit: Filmibeat

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+