గోదావరి పుష్కరాల పై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని డిసైడ్ అయింది. గతంలో ఉన్న పుష్కర ఘాట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. భక్తుల కోసం రవాణా సౌకర్యాలతో పాటుగా టెంట్ సిటీలు ఏర్పాటు చేయనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల పైన ప్రధానం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశం పైన మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేసారు.
ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పూర్తి చేసేందుకు గడువు ఫిక్స్ చేసింది. గతంలో జరిగిన పొరపాట్లతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. నంది అవార్డులపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడామని తెలిపారు. రెండు, మూడు నెలల్లో నే నంది అవార్డులు ప్రదానం చేస్తామని స్పష్టం చేశారాయన. ఫిలిం టూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కొత్త టూరిజం పాలసీ ద్వారా ఏపీలో 4,373 హోటల్స్‌లో రూమ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. రూ.428 కోట్ల పెట్టుబడు లు తీసుకొచ్చామని వివరించారు. ఈ ఏడాది నుంచి సీ ప్లేన్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. 7 యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేశామన్న ఆయన.. రూ.115 కోట్లతో హరిత హోటల్స్‌ను ఆధునికీకరించామని వెల్లడించారు.
వ్యూహం మార్చిన పవన్, బీజేపీ నేత మంత్రాంగం..!!

పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు
కాగా, పురాతన మండువా ఇళ్లను.. హోంస్టేలుగా అభివృద్ది చేస్తామన్నారు. ఏపీలో ఉన్న 21 పుణ్యక్షేత్రాల్లో టెంట్‌హౌస్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఏపీలో 21 హౌస్‌బోట్లు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సూర్యరాయ ఆంధ్ర నిఘంటువును తిరిగి ముద్రించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక డెస్క్‌ను ఏర్పాటు చేస్తామన్న దుర్గేశ్.. వెల్‌నెస్ సెంటర్లను సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటుచేసి పర్యాటక భవన్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేసారని కందుల ఆరోపించారు.
Credit: Oneindia


Click it and Unblock the Notifications