తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంకును గట్టెక్కించేందుకు ప్రయివేటు ఈక్విటీ (PE)ల వైపు కూడా చూస్తున్నారు. యస్ బ్యాంకు రెస్క్యూ కన్సార్టియంలో చేరేందుకు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేషన్ ఝున్‌ఝున్‌వాలా, డీమార్ట్ (అవెన్యూ సూపర్ మార్ట్స్) అధినేత రాధాకిషన్ ధమానీ, ప్రేమ్‌జీ ఈన్వెస్ట్ వైపు చూస్తున్నారు.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు..

ఎక్కువమంది.. తక్కువ వాటా..
యస్ బ్యాంకు రీక్యాపిటలైజేషన్ ప్లాన్ కోసం ఎంపిక చేసిన ప్రయివేటు ఇన్వెస్టర్లలో దమానీ, ఝున్‌ఝున్‌వాలా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకులో ఎక్కువ మంది వాటాదారులు చేరేలా చూసి తద్వారా ఏ వాటాదారుకు 5 శాతానికి మించి లేకుండా చూడాలని సెంట్రల్ బ్యాంక్ భావిస్తోందట.

పెట్టుబడికి సిద్ధం..
PSUల అంశాన్ని పక్కన పెడితే ప్రయివేటు ఈక్విటీ వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే యస్ బ్యాంకు టయర్ 2 బాండ్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని కొన్ని సంస్థలు భావిస్తున్నాయట. ప్రయివేటు ఈక్విటీలు 1.7 బిలియన్ డాలర్ల మొత్తాన్ని యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట.

ప్రయివేటు భాగస్వామ్యం...
యస్ బ్యాంకును పునరుద్ధరించే ప్రణాళికను ఆర్బీఐ దాదాపు ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన పరిష్కారమార్గాలు ఇందులో పొందుపరిచింది. దీని ప్రకారం పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వరంగ ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులను పరిగణలోకి తీసుకుంటుంది. దీనిపై ఆర్బీఐ మొదట ఓ ప్రకటన చేస్తుంది.

పెట్టుబడులు
ఆర్బీఐ ప్రకటన వచ్చిన రెండోరోజున బ్యాంకులు దాదాపు రూ.20,000 కోట్ల నిధులను ఈక్విటీ కింద సమకూరుస్తాయి. మూడో రోజు PSUలు దాదాపు రూ.30,000 కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంకు సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీ)లో ఇన్వెస్ట్ చేస్తాయి. నాలుగో రోజున మారటోరియం తొలగిస్తారు. ఇన్వెస్ట్ చేస్తున్న బ్యాంకుల నుంచి హామీ వచ్చాక ఆర్బీఐ ప్రణాళికను ప్రకటిస్తుంది.

ప్రయివేటు బ్యాంకులు..
ఎస్బీఐతో పాటు HDFC బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు వంటి ప్రయివేటు దిగ్గజాలు కూడా యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. తద్వారా యస్ బ్యాంకు సామర్థ్యంపై నమ్మకం పెరిగి, ఇతర బ్యాంకులు కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావొచ్చని అంచనా. కొత్తగా జారీ చేసే ఈక్విటీలో రూ.20,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే బ్యాంకులకు యస్ బ్యాంకులో 75% వాటా దక్కుతుంది. షేర్ల పరిమాణం భారీగా పెరగడంతో ప్రస్తుతమున్న షేర్ హోల్డర్ల వాటా నాలుగో వంతుగా ఉంటుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications