యస్ బ్యాంకు వ్యవస్థాపకులు రాణా కపూర్‌ను కోర్టు ఆదివారం ఈడీ కస్టడీకి అప్పగించింది. మార్చి 11వ తేదీ వరకు ఆయనను ముంబై ప్రత్యేక కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో రాణా కపూర్‌ను ఈడీ సుదీర్ఘ సమయం విచారించింది. అనంతరం ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టింది.
ఈడీ అధికారులు శనివారం రాణా కపూర్‌ను మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆదివారం రానాకపూర్ భార్యను కూడా ఈడీ అధికారులు కార్యాలయంలో విచారించారు. ముంబైలోని వొర్లీ ప్రాంతంలో కపూర్ నివాసం సముద్ర మహల్లో తదితర ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. రానాకపూర్ నేతృత్వంలో యస్ బ్యాంక్ పెద్ద మొత్తంలో DHFLకు జారీ చేసిన రుణాలు నిరర్థక ఆస్తులుగా(NPA) మారాయని ఈడీ చెబుతోంది.

ఇదిలా ఉండగా యస్ బ్యాంకు కస్టమర్లకు ఆ బ్యాంకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. కస్టమర్లు తమ డెబిట్ కార్డును ఉపయోగించి ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. యస్ బ్యాంకులో ఎస్బీఐ 49% వాటాను కొనుగోలు చేయనుంది. యస్ బ్యాంకు ఉద్దీపన ప్రణాళిక కింద ఎస్బీఐ తన నివేదికను సోమవారం ఆర్బీఐకి సమర్పిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications