ముంబై: దేశంలో అతి పెద్ద ప్రైవేటు కార్పొరేట్ బ్యాంక్‌లల్లో ఒకటైన యస్ బ్యాంక్.. తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఎక్స్ఛేంజ్‌కు సమర్పించింది. సుదీర్ఘకాలం తరువాత ఈ బ్యాంక్ భారీ లాభాలను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లోనూ లాభాల బాట పట్టింది. ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం.. మార్చి 31వ తేదీన ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 367 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. 37.9 శాతం మేర వృద్ధి రేటును అందుకుంది.
అన్ని రకాల పన్నుల చెల్లింపుల తరువాత 367 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసినట్లు వివరించింది. డిసెంబర్ 31వ తేదీ నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో సాధించిన నికర లాబాలు 266 కోట్ల రూపాయలు. ఆర్థిక సంవత్సరం మొత్తానికీ నికర వడ్డీ ఆదాయంలో భారీగా పెరుగుదల కనిపించింది. 84.4 శాతంతో 1,819 కోట్ల రూపాయలుగా చూపించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 987 కోట్ల రూపాయలు.

బ్యాంక్ వడ్డీ రహిత ఆదాయంలో 27.9 శాతం పెరుగుదలను రికార్డ్ చేసింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికీ 689 కోట్ల నుంచి 882 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరర్థక ఆస్తుల్లోనూ స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 13.93 నుంచి 14.7 శాతానికి పెరిగింది. నెట్ ఎన్పీఏ రేషియో 76 పాయింట్ల మేర తగ్గింది. నాలుగో త్రైమాసికంలో యస్ బ్యాంక్ ప్రావిజన్స్ 271 కోట్ల రూపాయలకు చేరాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంతో పోల్చి చూస్తే ప్రావిజన్స్‌లో 27.7 శాతం మేర క్షీణత కనిపించింది.
ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆశించిన ఫలితాలను అందుకున్నామని యస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. రెండు సంవత్సరాల తరువాత క్యాపిటల్ పొజీషన్, హెల్తీ బ్యాలెన్స్ షీట్ నమోదు చేశామని చెప్పారు. డిజిటల్ చెల్లింపులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని పేర్కొన్నారు. దేశం మొత్తం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల దిశగా సాగుతోందని, దీనికి అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్, ఫిన్‌టెెక్ ఎకో సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పుడు నమోదు చేసిన నికర లాభాలను మరింత మెరుగుపర్చుకుంటామని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications