యస్ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పదిహేను రోజుల క్రితం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈ రోజు (మార్చి 18) సాయంత్రం దీనిని ఎత్తివేసింది. పరిమిత నగదు ఉపసంహరణ, బ్యాంకింగ్ సేవలు లేకుండా ఇప్పటి వరకు కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. మారటోరియం ఎత్తివేయడం కష్టమర్లకు శుభవార్తే.
యస్ బ్యాంకు ఈ రోజు నుండి బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1,132 యస్ బ్యాంకు బ్రాంచీలు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3వ తేదీ వరకు కస్టమర్లు రూ.50 వేల విత్ డ్రా పరిమితిని విధించింది. సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకు బోర్డును కూడా ఆర్బీఐ రద్దు చేసి, అడ్మినిస్ట్రేటర్‌గా ప్రశాంత్ కుమార్‌ను నియమించింది.

బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మారటోరియం ఎత్తివేసిన నేపథ్యంలో బ్యాంకింగ్ సర్వీసులు పూర్తిగా తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యస్ బ్యాంకు ట్వీట్ చేసింది. మారటోరియం సాయంత్రం ఆరు గంటలకు ఎత్తివేశారని, సర్వీసులు పునరుద్ధరించామని, కస్టమర్లకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని, మీ సహనానికి, సహకారానికి థ్యాంక్స్ అంటూ కస్టమర్లను ఉద్దేశించి పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications