యస్ బ్యాంకు సంక్షోభంలో మరో కీలక పరిణామం. ఈ కేసుకు సంబంధించి అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బ్యాంకు వ్యవస్థాపకులు రానా కపూర్‌ను ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో అధికారులు అరెస్టు చేసి విచారించారు. తాజాగా అనిల్ అంబానీకి సమన్లు ఇవ్వడం గమనార్హం. ముంబైలోని ఈడీ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే అనారోగ్య కారణాల వల్ల తాను సోమవారం విచారణకు హాజరు కాలేనని అనిల్ అంబానీ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అనిల్ అంబానీతో పాటు యస్ బ్యాంకు నుండి రుణాలు పొందిన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీ చేశారు. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు యస్ బ్యాంకు నుండి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ గుర్తించింది. దీంతో నోటీసులు జారీ చేసింది.

అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు యస్ బ్యాంకు నుండి రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవి నిరర్థక ఆస్తులగా మారాయట. మార్చి 6వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనిల్ అంబానీ గ్రూప్ పేరుతో పాటు ఎస్సెల్, ఐఎల్ఎప్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ తదితర గ్రూపులను ప్రస్తావించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications