ముంబై: బంగారం, వెండి ధరలు గురువారం (అక్టోబర్ 22) ప్రారంభ సెషన్‌లో తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.223 (0.43 శాతం) క్షీణించి రూ.51,110 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,199 వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా, అదే ధర గరిష్టం కాగా, రూ.51,064 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక ప్యాకేజీపై స్పష్టత, సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్షీణించడంతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. అయితే తాజాగా డాలర్ వ్యాల్యూ పెరగడంతో పసిడి, వెండి ధరలు తగ్గాయి.

రూ.200కు పైగా తగ్గిన పసిడి ధర
బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.220 (0.43 శాతం) క్షీణించి పది గ్రాముల ధర రూ.51స166 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,226 వద్ద ప్రారంభమైన ధర, అదే ధర గరిష్టం కాగా, రూ.51,166 వద్ద కనిష్టాన్ని తాకింది.ఆగస్ట్ 7న ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఆ ధరతో రూ.5,000 వరకు తక్కువ పలికింది. నిన్న బంగారం ధర రూ.500 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు రూ.200కు పైగా క్షీణించింది.

రూ.700కు పైగా తగ్గిన వెండి ధర
వెండి ధర కూడా బంగారం దారిలోనే క్షీణించింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.729(1.15 శాతం) క్షీణించి రూ.62,900 పలికింది. రూ.61,111వద్ద ప్రారంభమైంది. గరిష్టం కూడా కూడా ఇదే. రూ.62,766 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.744 (1.14 శాతం) క్షీణించి రూ.64,563 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,589 వద్ద ప్రారంభమైన ధర రూ.64,609 వద్ద గరిష్టాన్ని, రూ.64,540 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ హై రూ.79వేలతో వెండి ఇప్పటికీ రూ.17వేలకు పైగా తక్కువ పలుకింది.

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు తగ్గాయి. ఔన్స్ పసిడి 0.69 శాతం క్షీణించి 1,916.35 డాలర్లు పలికింది. 1,913.05 - 1,929.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,929.50 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 1928 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఏడాదిలో ధర 26.89 శాతం పెరిగింది.
వెండి ధర కూడా 1.47 శాతం క్షీణించి ఔన్స్ 24.867 డాలర్లు పలికింది. 24.775 - 25.215 డాలర్ల మధ్య పలికింది. క్రితం సెషన్‌లో 25.241 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది వెండి 41.23 శాతం పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications