For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yatra Online IPO: ముహూర్తం కోసం వెయిటింగ్

|

ముంబై: లీడింగ్ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు రానుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కు సమర్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ మాతృసంస్థ యాత్ర ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్. ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్‌లో లిస్టెడ్ కంపెనీ.

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 750 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ నిర్ణయించుకుంది. ఈ మొత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపింది. ఈ విషయాన్ని సెబికి అందజేసిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది. వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇతర ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లను టేకోవర్ చేయడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని పేర్కొంది.

Yatra Online has filed draft papers with Sebi for an IPO worth up to Rs 750 Cr likely to hit Q2 of FY 22

ఆఫర్ ఫర్ సేల్ కింద పెట్టిన ఈక్విటీల సంఖ్య మొత్తం 93,28,358. ఇందులో 88,96,998 షేర్లను టీహెచ్‌సీఎల్ ట్రావెల్ హోల్డింగ్స్ సైప్రస్ లిమిటెడ్, 4,31,360 షేర్లను పండోరా ట్రస్ట్ స్కీమ్‌కు కేటాయిస్తుంది. ట్రస్టీ విస్టా ఐటీసీఎల్ (ఇండియా) లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ ఇది. కాగా- యాత్ర ఆన్‌లైన్ ఐపీఓ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌ అపాయింట్ అయ్యారు.

తొలుత ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-మే-జూన్ మధ్యకాలంలో ఐపీఓను జారీ చేయాలని భావించినప్పటికీ.. దీన్ని ఇంకాస్త వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. రెండో త్రైమాసికం అంటే జులై-ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో యాత్రా ఐపీఓ జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. సెబి అనుమతి లభించిన వెంటనే- ప్రైస్ బ్యాండ్‌, లాట్‌ను నిర్ధారిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం పూర్తిగా తగ్గిన తరువాత ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లకు మళ్లీ గిరాకీ పెరిగిన విషయం తెలిసిందే.

English summary

Yatra Online IPO: ముహూర్తం కోసం వెయిటింగ్ | Yatra Online has filed draft papers with Sebi for an IPO worth up to Rs 750 Cr likely to hit Q2 of FY 22

Yatra Online Ltd has filed draft papers with markets regulator Sebi for an initial public offering that includes fresh issue of shares worth up to Rs 750 crore, likely to hit Q2 of FY 22.
Story first published: Saturday, May 21, 2022, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X