భారత్-చైనా సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఉద్రిక్తతల్లో చిక్కుకున్న విషయం విదితమే. 2020 గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.అమెరికా ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం సుంకం విధించడం భారతదేశంలోని వివిధ రంగాలను ప్రభావితం చేసినప్పటికీ, ఒకవైపు అది ఒక ప్రయోజనాన్ని కూడా తెచ్చిపెట్టింది. భారతదేశం, చైనా అనే రెండు దేశాలు మళ్ళీ దగ్గరవడం ప్రారంభించాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య చైనా రహస్య లేఖతో సంబంధాలు మళ్లీ చిగురించాయి. ఆ లేఖ రాసింది స్వయంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్. అఫిషియల్ అధికారులు తెలిసిన వివరాల ప్రకారం..జిన్‌పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మార్చిలో రాసిన ఆ లేఖలో, రెండు దేశాల సంబంధాలను మెరుగుపరచుకోవాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. భారతదేశంపై అమెరికా తీసుకున్న సుంకాల చర్య అన్యాయమని పేర్కొంటూ చైనా భారతదేశానికి తన మద్దతును బహిరంగంగా ప్రకటించింది. భారతదేశం, చైనా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా క్రమంగా పరిష్కరిస్తున్నాయి.
అయితే అదే సమయంలో.. అమెరికాతో భారత్ కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందాలు చైనా ప్రయోజనాలకు హాని కలిగించే అవకాశాలపై రెండు దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. బీజింగ్ ప్రయత్నాలను సమన్వయం చేస్తున్న ఒక కీలక ప్రాంతీయ అధికారి పేరును కూడా తాజాగా బయటకు వచ్చిన లేఖలో పేర్కొన్నారని సమాచారం. చివరికి ఆ లేఖ నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చేరింది. ఆ లేఖ రాసిన కొద్దికాలానికే, ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్ నుంచి మోదీ ప్రభుత్వం చైనాతో సంబంధాలను పునరుద్ధరించేందుకు చురుకైన చర్యలు ప్రారంభించింది.

అమెరికాతో వాణిజ్య చర్చలు తీవ్ర వివాదాస్పదంగా మారిన వేళ, భారత్‌కు కొత్త దౌత్య సమతుల్యత అవసరమైంది. ఇదే సమయంలో.. మే నెలలో ట్రంప్ భారతదేశం-పాకిస్తాన్ కాల్పుల విరమణలో మధ్యవర్తిగా వ్యవహరించానని చేసిన ప్రకటనపై న్యూఢిల్లీలోని అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చైనాతో పునరుద్ధరణ దిశగా అడుగులు వేయడం న్యూఢిల్లీకి సహజమైన పరిణామంగా మారింది.
జిన్‌పింగ్ లేఖ రాసిన కొద్దికాలానికే..మార్చిలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో భారత్-చైనా సంబంధాలను డ్రాగన్-ఏనుగు టాంగోగా వర్ణించారు. ఈ పదబంధాన్ని తర్వాత చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ సహా పలువురు ఉన్నతాధికారులు పునరావృతం చేస్తూ.. ఇరు దేశాల మధ్య కొత్త ఆశలు చిగురించాయని చెప్పుకొచ్చారు. ట్రంప్ విధించిన సుంకాల ఒత్తిడి మధ్య, భారత్-చైనా ఇటీవల కాలనీయ కాలం నాటి సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి కొత్త దశలోకి ప్రవేశించాయి.
గత వారం రెండు దేశాలు ఈ చర్చలను వేగవంతం చేయాలని అంగీకరించడం, 2020 గాల్వన్ లోయ ఘటనను దాటి ముందుకు వెళ్ళే సంకేతమని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య, ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారి చైనాకు వెళ్ళబోతున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య, భద్రతా, రాజకీయ సహకారానికి పునాది వేయవచ్చని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications