For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

WPI inflation: ఆగస్ట్‌లో 0.16% పెరిగిన ద్రవ్యోల్భణం: ఫుడ్, తయారీ వస్తువుల ధరలు ఖరీదు

|

వరుసగా నాలుగు నెలల ప్రతికూలత అనంతరం భారతదేశంలో టోకు ధరల సూచిక ఆధారిత(WPI) ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 0.16 శాతం మేర పెరిగింది. నెలవారీ డబ్ల్యుపీఐ ఆధారంగా వార్షిక ద్రవ్యోల్భణ రేటు 2020 ఆగస్ట్ (2019 ఆగస్ట్) 0.16 శాతం పెరిగినట్లు తెలిపింది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 1.17 శాతంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

WPI ద్రవ్యోల్భణం ఏప్రిల్ మైనస్ 1.57 శాతం, మే నెలలో మైనస్ 3.37 శాతం, జూన్ నెలలో మైనస్ 1.81 శాతం, జూలై నెలలో మైనస్ 0.58 శాతం నమోదైంది. ఫ్యూయల్, పవర్ ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 9.68 శాతం మేర పడిపోయింది. అంతకుముందు నెలలో ఇది 9.84 శాతంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ద్రవ్యోల్భణం 1.27శాతంగా ఉంది. జూలై నెలలో ఇది 0.51శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ ద్రవ్యోల్భణం 4.07 శాతంగా ఉంది.

రూ.1,240 కోట్లతో విశాఖలో జపాన్ కంపెనీ ఆఫ్-హైవే టైర్ల ప్లాంట్, 600 కొత్త ఉద్యోగాలురూ.1,240 కోట్లతో విశాఖలో జపాన్ కంపెనీ ఆఫ్-హైవే టైర్ల ప్లాంట్, 600 కొత్త ఉద్యోగాలు

WPI inflation rises for the first time in five months

ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, సిమెంట్, ప్రాథమిక లోహాలతో సహా 17 రంగాల్లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తుల్లోని పదింటి ఇండెక్స్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాక్ డౌన్ అనంతరం ధరలు పెరిగినట్లు సోమవారం నాటి సూచీ వెల్లడించింది. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 3.84 శాతంగా ఉంది. బంగాళాదుంప ధరలు 82.93 శాతం పెరిగంది. కూరగాయల ద్రవ్యోల్భణం 7.03 శాతంగా ఉంది. ఉల్లి ద్రవ్యోల్భణం మైనస్ 34.48 శాతంగా ఉంది.

English summary

WPI inflation: ఆగస్ట్‌లో 0.16% పెరిగిన ద్రవ్యోల్భణం: ఫుడ్, తయారీ వస్తువుల ధరలు ఖరీదు | WPI inflation rises for the first time in five months

Wholesale inflation in India inched up for the first time since March as prices of primary articles and manufactured products increased.
Story first published: Monday, September 14, 2020, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X