ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి కార్పోరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వడంపై తమ అభిప్రాయం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. నిపుణులు, ప్రజలనుండి తీసుకున్న అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్త బ్యాంకులు పెట్టేందుకు కార్పోరేట్లకు అనుమతి ఇవ్వాలని ఆర్బీఐ నియమించిన ప్యానెల్ ఇటీవల సూచించినన విషయం తెలిసిందే. ప్రయివేటురంగ బ్యాంకుల్లో మూలధనం, బ్యాంకింగ్ చట్టంలో మార్పులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారడంపై సూచనలు చేసింది. ఇందులో కార్పోరేట్లకు అనుమతి ఇవ్వాలనే సూచనపై విమర్శలు వచ్చాయి.

అందరి నుండి అభిప్రాయం తీసుకున్నాకే
కార్పోరేట్లకు అనుమతి ఇవ్వాలన్న సూచనలపై నిపుణుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శక్తికాంతదాస్ స్పందిస్తూ... అది ఆర్బీఐ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక అని, దానినే ఆర్బీఐ తుది నిర్ణయం లేదా అభిప్రాయంగా పరిగణించవద్దని స్పష్టం చేశారు. దీనిని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. కమిటీ సూచనలపై కేంద్ర బ్యాంకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అందరి నుండి అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం ఉంటుందన్నారు.

కొన్నాళ్లుగా చర్చ
ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ అందించిన నివేదికపై కొన్నాళ్ళుగా చర్చ జరుగుతోంది. బడా వ్యాపార వర్గాలకు విభిన్న బ్యాంకింగ్ లైసెన్సుల కోసం అనుమతులు ఇవ్వాలని, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచించింది. అయితే పెద్ద పారిశ్రామికవర్గాలకు బ్యాంకింగ్ అనుమతులు ఇవ్వాలనే ఆలోచనపై విమర్శలు వస్తున్నాయి. ప్రయివేటు బ్యాంకుల్లోకి కార్పోరేట్లను అనుమతించాలన ఆర్బీఐ కమిటీ చేసిన సిఫార్సులు లాభమా నష్టమా అని వాణిజ్య వర్గాలలో చర్చకు దారి తీసింది.

నిపుణుల హెచ్చరిక
ప్రయివేటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలను అనుమతించాలని ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం సిపార్సు చేయడాన్ని రఘురాం రాజన్, విరల్ ఆచార్య, కౌశిక్ బసు తదితరులు తప్పుబట్టారు. భారత కార్పోరేట్ కంపెనీలను బ్యాంకింగ్‌లోకి అనుమతివ్వడంపై ప్రధాన ప్రశ్న తలెత్తుతోందని, ఆర్థిక రంగం బలహీనంగా ఉన్న ఈ సమయంలో సరికాదని, బ్యాంకులపై ఇది పిడుగుపాటు అన్నారు. కార్పోరేట్లకు, పరిశ్రమలకు రుణాల అవసరం ఉంటుందని, బ్యాంకులు వారి చేతిలోనే ఉంటే నిధులు ఈజీగా మంజూరు చేసుకుంటారని, ఇక బ్యాంకులను నిర్వహించే వ్యాపార సంస్థలపై ఆర్థిక, రాజకీయ నాయకుల దృష్టి పడకుండా ఉంటుందా అని రాజన్, ఆచార్య ప్రశ్నించారు. ఇది ఆశ్రిత పెట్టుబడిదారి విధానానికి తద్వారా ఆర్థిక ఆస్థితరతకు దారితీయవచ్చునని హెచ్చరించారు ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు హెచ్చరించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications