ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకటే చర్చ. కరోనా వైరస్ తప్ప మరోటి లేదు. చైనా లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే 18 లక్షల మందికి సోకిన ఈ భయంకరమైన వైరస్... సుమారు 1 లక్ష మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా వంటి పెద్ద దేశాలు ఈ మహమ్మారి బారిన పడి విలవిల లాడుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావటం, మరణాల్లోనూ నెంబర్ వన్ స్థానానికి చేరున్న అగ్రరాజ్యం ... తాను ఏ విషయంలోనైనా నెంబర్ వనే అని నిరూపించుకుంది. భారత దేశం విషయానికి వస్తే లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయటం వల్ల బతికిపోయాం కానీ... లేదంటే మన దేశంలో ఉన్న సౌకర్యాలతో ఈ వైరస్ పై పోరాటం చేయటం సాధ్యమయ్యేది కాదు.
135 కోట్ల మంది ప్రజలు, అరకొర వసతులున్న భారత్ లో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం పెరిగినా తట్టుకునే శక్తి మనకు లేదని పాలకులకు తెలుసు. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దేశాన్ని, ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ప్రపంచ దేశాలతో ఔరా అనిపించుకుంటున్నారు. ఐతే, ఇప్పుడు మరో టాపిక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే వర్క్ ఫ్రొం హోమ్.

లాభాలు భళా...
వర్క్ ఫ్రొం హోమ్ అనే కాన్సెప్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి మాత్రమే పరిమితయ్యేది. అది కూడా కొన్ని కంపెనీలు, కొన్ని విభాగాలకు పరిమితంగా ఉపయోగించేవారు. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని కంపెనీలు, ఫ్యాక్టరీ లు మూత పడ్డాయి. కొన్ని రంగాల్లో అవసరమైన మేరకు వర్క్ ఫ్రొం హోమ్ అమలు చేస్తున్నారు.
ఎప్పుడూ చూడని విధంగా దేశంలో తొలిసారి మీడియా రంగం కూడా వర్క్ ఫ్రొం హోమ్ బాట పట్టింది. పేపర్లు కూడా ప్రింట్ కంటే డిజిటల్ వెర్షన్ లో ఎక్కువ కవరేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఆఫీస్ లు మూసివేయటంతో కరెంటు బిల్లులు, మైంటెనెన్సు, స్టేషనరీ ఖర్చులు కలిసివస్తున్నాయి. ఇంటర్నెట్ బిల్లులు కూడా కలిసివస్తున్నాయి. దీంతో, చాలా కంపెనీలకు అడ్మినిస్ట్రేషన్, జనరల్ ఎక్సపెన్డ్డిచార్ వ్యయాలు తగ్గిపోయాయి.

పని చేస్తున్నారా...?
ఏదో తప్పనిసరి కాబట్టి వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇచ్చాం. కానీ, ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనే ఆందోళన కంపెనీల్లో ఉంది. కానీ, వారు ఈ సయమంలో ప్రతి రోజు పని పూర్తి అయిన తర్వాత డైలీ టాస్క్ రిపోర్ట్ సమర్పించాలని కోరుతున్నారు. అందులో ఏ పనికి ఎంత సమయం పట్టిందో తెలిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
దీంతో ఉద్యోగులకు పని తో పాటు ప్రతి రోజు రిపోర్టులు పంపించే అదనపు బాధ్యతలు కూడా అప్పజెపుతున్నారు. కొన్ని రంగాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ చేయటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఒకప్పుడు 9 టూ 5 జాబ్ అయితే... ఇప్పుడు 5 టూ 9 అయిపోయిందని... దీంతో కొంత ఒత్తిడికి లోనవుతున్నామని కూడా ఉద్యోగులు కంప్లైన్ చేస్తున్నారు. అయితే, మార్కెటింగ్ వంటి కొన్ని తప్పనిసరిగా ఫీల్డ్ లోకి వెళ్లే జాబ్స్ లో మాత్రం ప్రస్తుతం ఎలాంటి ఉత్పాదక లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే కంటిన్యూ...
దేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగంపై సుమారు 65% ప్రజలు ఆధారపడుతున్నారు. వారికి పూర్తి జీవనాధారం వ్యవసాయమే. ఇక సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి సుమారు 30 కోట్ల మంది ప్రజలు వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారు. వీరిలో ఒక్క తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్), లాజిస్టిక్స్ రంగాలు, ఫ్రంట్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ సేల్స్ వంటి ఉద్యోగాలు తప్ప మిగితావన్నీ వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా కూడా చేయవచ్చు.
దేశంలో 4జి విస్తృతి, మొబైల్ డేటా వినియోగం పెరిగిపోవటం, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ మెరుగ్గా ఉండటంతో ఆఫీస్ అయినా.. ఇల్లు అయినా పనిచేయటానికి పెద్ద తేడా ఉండటం లేదు. మునుముందు స్టార్టుప్ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలు పెద్ద పెద్ద ఆఫీస్ లు కలిగి ఉండే బదులు, చిన్న కార్యాలయాలు, వర్చువల్ కార్యాలయాల ద్వారా నెట్టుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అటు వ్యయాలు తగ్గుతాయి, ఇటు ప్రజా రవాణా వ్యవస్థపై భారం తగ్గి కాలుష్యం కూడా తగ్గిపోతుంది. ఇలాంటి అనేక ప్రయోజనాల వల్ల లాక్ డౌన్ తర్వాత చాలా కంపెనీలు తప్పనిసరిగా తమ మానవ వనరుల విధానాల్లో వర్క్ ఫ్రొం హోమ్ అనే అంశాన్ని చేరుస్తాయని చెబుతున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications