Train Ticket Prices: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో ట్రైన్ టికెట్ ధరలు తగ్గింపు..!

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ ధరలు తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే అన్ని రైళ్లలో కాకుండా ఎంపిక చేసి రైళ్లలో మాత్రమే టికెట్ ధరలు తగ్గనున్నాయి. తగ్గించిన టికెట్ ధరలు 2027 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. తరగతిని బట్టి ఒక్కొ టికెట్‌పై రూ.15 నుంచి రూ.75 వరకు తగ్గించే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న 40 పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఎక్స్ ప్రెస్ లుకా మార్చే అవకాశం ఉంది. ఈ సూపర్ ఫస్ట్ రైళ్లు గంటకు 55 కిలో మీటర్ల వేగం అందుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి వీటికి సూపర్ ఫస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల హోదాను తగ్గించి ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మారుస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

సాధారణంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్ల టికెట్లు ధరల్లో తేడాలు ఉంటాయి. సూపర్ ఫాస్ట్ రైళ్ల ఛార్జీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే 40 సూపర్ ఫాస్ట్ రైళ్లు సాధారణ ఎక్స్ ప్రెస్ లు మారుస్తున్న నేపథ్యంలో ఈ రైళ్లలో టికెట్ ఛార్జీలు తగ్గించనున్నారు. దేశంలో గంటకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ అందుకోవడం విఫలమైన 47 సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను 2027 జనవరి ఒకటి నుంచి సాధారణ ఎక్స్ ప్రెస్ లుకా మారనున్నాయి. రైళ్ల నంబర్లు సైతం మార్చనున్నారు. ఈ రైళ్ల సమయం ఎప్పటిలాగే ఉంటుంది. కానీ.. టికెట్ ధరలు తగ్గుతాయి. రైల్వే నిబంధనల ప్రకారం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గంటకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లాల్సి ఉంటుంది.

Train Tickets Price

అలాంటి రైళ్లనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా పరిగణిస్తారు. కొద్ది నెలల క్రితం రైల్వే అధికాలు దేశంలో నడుస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాలని రైల్వే అధికారులు పరిశీలించారు. ఇందులో 47 రైళ్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వేగాన్ని అందుకోవడం లేదని గుర్తించారు. వాటిని సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చాలని సిఫార్సు చేసింది. దీంతో ఆ రైళ్లను సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చనుంది. సెంట్రల్ రైల్వే పరిధిలో CSMT-పూణే ప్రగతి, LTT-అయోధ్య కంటోన్మెంట్ తులసితో సహా 18 సర్వీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో సప్త క్రాంతితో సహా 20 సర్వీసులు కొనసాగుతున్నాయి.

తానక్‌పూర్-ఢిల్లీ, డెహ్రాడూన్-కాఠ్‌గోడమ్‌తో సహా మరో ఎనిమిది ఉత్తరాఖండ్ మార్గాలు ఉండగా.. గోవా ఎక్స్‌ప్రెస్ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లల్లో జనవరి 1 నుంచి సెకండ్ క్లాస్ టికెట్ల ధర రూ.15, స్లీపర్ క్లాస్ చార్జీ రూ.30, ఏసీ చైర్ కార్, థర్డ్ టైర్, సెకండ్ టైర్ టికెట్ ధర రూ.45, ఏపీ ఫస్ట్ క్లాస్ టికెట్ల ధర రూ.75 వరకు తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. మరో వైపు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మార్చనున్నారు. చెన్నై ఎగ్మోర్-రామేశ్వరం, తాంబరం-తిరుచిరాపల్లి రైళ్లతో సహా తమిళనాడులోని ఎనిమిది రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మారనున్నాయని దక్షిణ రైల్వే పేర్కొంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+