Great Place To Work: మహిళలు పనిచేసేందుకు దేశంలో బెస్ట్ కంపెనీ ఇదే.. సర్వేలో 70% మంది చెప్పిన మాట..
Great Place To Work: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు జీతభత్యాల కంటే పనిచేయటానికి మంచి ఆఫీస్ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. పైగా మహిళలకు పనిచేసేచోట్ల ఉండే అనేక రకాల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ఈ కంపెనీ మాత్రం మహిళలు పనిచేయటానికి బెస్ట్ కంపెనీగా సర్వేలో గుర్తింపబడింది. అవును ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళలు మెచ్చిన కంపెనీ..
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో మహిళలు పనిచేయటానికి ఉత్తమమైన ప్రదేశంగా Great Place to Work సంస్థ చేపట్టిన సర్వేలో ఎంపికైంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనేది అధిక-నమ్మకం, అధిక-పనితీరు గల సంస్కృతులను సృష్టించడంపై దృష్టి సారించిన ప్రపంచ వేదిక.

60 దేశాల్లో సర్వేలు..
60 దేశాలు, 6 ఖండాల్లోని కార్పొరేషన్లు, లాభాపేక్షలేని సంస్థలు, ప్రభుత్వ సంస్థలతో సహా 10,000 సంస్థల మధ్య ఈ అధ్యయనాన్ని Great Place to Work సంస్థ నిర్వహించబడింది. కంపెనీలో కనీసం 10% మంది మహిళలు పనిచేస్తున్న విప్రోలో 70% మంది సానుకూల అభిప్రాయాన్ని పంచుకోవడంతో ఐటీ దిగ్గజం ఈ టాప్ లిస్ట్‌లో ఎంపికైంది.

జెండర్ ఈక్వాలిటీ..
విప్రో లింగ సమానత్వం, అద్భుతమైన పని అనుభవం, అన్ని స్థాయిలలో సమాన వేతనం వంటి అనేక ఇతర అంశాలలో రాణిస్తుందని సర్వే వెల్లడించింది. వైవిధ్యమైన వర్క్‌ఫోర్స్ గురించి మేము గర్విస్తున్నామని విప్రో చీఫ్ కల్చరల్ ఆఫీసర్ సునీత రెబెక్కా చెరియన్ అన్నారు. కంపెనీ బలమైన విజయానికి వారే గుండెకాయ అని అభిప్రాయపడ్డారు.

చోటు దక్కించుకున్న ఇతర కంపెనీలు..
భారతదేశంలో విప్రోతో పాటు.. శివ్ నాడార్స్ స్కూల్, డెలాయిట్ ఇండియా, సిస్కో సిస్టమ్స్, టాటా కమ్యూనికేషన్స్, ఇన్ఫోసిస్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కుటుంబ పోషనలో భాగంగా ఉపాధి కోసం ప్రస్తుత కాలంలో మహిళలు కూడా పనిచేస్తున్నారు. వారికి సురక్షితమైన, కంఫర్టబుల్ పని వాతావరణం ఉండటం చాలా కీలకమని ఈ సర్వే చెప్పకనే చెబుతోంది.


Click it and Unblock the Notifications