Wipro Hyderabad Hiring: ఒకపక్క ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ట్రైనీలను ఇంటికి పంపించిన వార్త దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ మరోపక్క కొత్త ఉద్యోగాల కోసం వేటాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల టెక్కీలకు శుభవార్త ఒకటి వచ్చేసింది. మన నగరంలోనే టెక్ ఉద్యోగం సంపాదించాలని భావిస్తున్న టెక్కీలకు ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది.
టెక్ దిగ్గజం విప్రో తన లింక్డిన్ ఖాతాలో పంచుకున్న వివరాలను పరిశీలిస్తే సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్ కోసం ఓపెనింగ్ గురించి పంచుకుంది. దీని కింద ఉద్యోగి క్లయింట్ వైపు మోహరించాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్‌లు లేదా అప్లికేషన్‌ల కోసం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను రూపొందించాల్సి ఉంటుంది. అలాగే వాటి టెస్టింగ్, మెయింటెనెన్స్ అందిస్తూ 100 శాతం నాణ్యతను పనిలో అందించాల్సి ఉంటుందని వెల్లడించింది. క్లయింట్లకు ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవటం వాటిని పరిష్కరించటం ముఖ్యమైన అంశంగా ఉంది. సమస్యలను మూలాల స్థాయికి పరిశీలించి వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

అలాగే క్లయింట్ల సమస్యలకు అనుగుణంగా సులువైన పరిష్కారాలను అందించాలని కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో ఇతర ఫంక్షనల్ టీమ్స్ తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేపట్టాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. పనిలో ముఖ్యంగా ఎలాంటి బగ్ల్ లేకుండా టెస్టింగ్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకోవాలని కంపెనీ పేర్కొంది. అలాగే కోడ్స్ ప్రాజెక్టు నిబంధనలు అతిక్రమించకుండా ఉండేలా చూసుకోవాలని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం కంపెనీ హైదరాబాదులో ఉద్యోగం కోసం రిక్రూట్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇది పూర్తిగా ఆన్ సైట్ ఉద్యోగం అని కంపెనీ వెల్లడించింది. అయితే రోల్ కోసం ఎంత వేతనాన్ని ఆఫర్ చేస్తోందనే వివరాలను మాత్రం కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కంపెనీ జాబ్ ఓపెనింగ్ కోసం అప్లై చేస్తున్నారు. చాలా కాలం నుంచి టాప్ టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపారాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయి.
గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ సదస్సులో హెచ్సీఎల్ టెక్, విప్రో, అమెజాన్ వంటి కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కొత్త క్యాంపస్ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో ఉపాధి కల్పనకు వారు హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో గ్రీన్ ఎనర్జీతో పాటు డేటా సెంటర్ల ఏర్పాటుకు కూడా అనేక అగ్రిమెంట్లు కుదుర్చుకుంది.


Click it and Unblock the Notifications