అమెరికా డాలర్ మారకంతో మంగళవారం రూపాయి 9 నెలల కనిష్టం రూ.75.4కు పడిపోయింది. గత మూడు వారాల కాలంలో ఇది 4.2 శాతం మేర క్షీణించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఇంత దారుణంగా పతనమైన ఓ దేశీయ కరెన్సీ ఇదే కావడం గమనార్హం. దేశీయంగా కరోనా సెకండ్ వేవ్, ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో గత మూడు వారాలుగా రూపాయి ఒత్తిడిలో ఉంది.

మూడు వారాల్లో భారీ పతనం
మార్చి 22వ తేదీన డాలర్ మారకంతో రూపాయి 72.38 వద్ద ట్రేడ్ అయింది. తాజాగా మంగళవారం 75.42 వద్ద ట్రేడ్ అింది. అంటే ఈ కొద్ది వారాల్లోనే ఏకంగా 4.2 శాతం క్షీణించింది. గతవారం ఓ సమయంలో రూపాయికి పైగా పతనమైంది. మంగళవారం నాడు డాలర్ మారకంతో 43 పైసలు క్షీణించింది. ప్రధానంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన వల్ల రూపాయి క్షీణించింది.

ఇతర కరెన్సీలు ఇలా..
బ్రెజిల్ కరెన్సీ రియల్ ఇదే మూడు వారాల కాలంలో 3.99 శాతం క్షీణించింది. రష్యన్ రూబుల్ 3.25 శాతం పడిపోయింది. థాయ్ బట్, ఇండోనేషియా రుపియాలు వరుసగా 2.33 శాతం, 1.5 శాతం పతనమయ్యాయి. కానీ భారత కరెన్సీ మాత్రం ఏకంగా 4.2 శాతం పడిపోయింది. ఇటీవల భారత్‌లో రోజుకు లక్ష కేసులు కూడా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది.

డాలర్ మారకంతో..
డాలర్ మారకంతో మార్చి 22వ తేదీ నుండి భారీగా పతనమైన కరెన్సీల్లో టర్కిష్ న్యూలిరా ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ ఉంది. మార్చి 22 నుండి టర్కిష్ న్యూ లిరా 4.36 శాతం, భారత రూపాయి 4.2 శాతం పడిపోయాయి. ఆ తర్వాత బ్రెజిలియన్ రియల్, రష్యన్ రూబుల్, థాయ్ భహ్త్, ఇండోనేషియా రుపియా ఉంది. ఆ తర్వాత చైనీస్ యువాన్ రెనిమింబీ 0.61 శాతం, మలేషియన్ రింగిట్ 0.51 శాతం, యూరో 0.36 శాతం, ఫిలిప్సిన్ పెసో 0.06 శాతం 2.51 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications