థాయిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు భౌతిక బంగారంపై అదనపు పన్ను విధించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే.. ఈ ఏడాది దేశంలోని ప్రజలు తమ ఖరీదైన బంగారాన్ని ఎక్కువగా అమ్మకాలు జరుపుతూ డాలర్లను సంపాదిస్తున్నారు. తరువాత, ఆ డాలర్లను తమ స్థానిక కరెన్సీ బాట్ లోకి మారుస్తున్నారు. ఇది థాయ్ బాట్‌ను వేగంగా బలపరుస్తోంది. గత వారం ఈ కరెన్సీ నాలుగు సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి చేరింది.
థాయిలాండ్ దేశానికి జాతీయ ఆదాయంలో దాదాపు 20 శాతం పర్యాటక రంగం ఆధారపడుతుంది. అయితే బలమైన స్థానిక కరెన్సీ వల్ల విదేశీ పర్యాటకులు ఈ దేశానికి రావడం ఖరీదుగా మారిపోతుంది. ఫలితంగా థాయ్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో.. థాయిలాండ్ బ్యాంకు కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. దేశీయ ఎగుమతులు పెరగడం, అమెరికా డాలర్ బలహీనపడడం కలిసిపడి, బాట్ బలపడటానికి ముఖ్య కారణాలయ్యాయి. దీనికి అదనంగా అమెరికా ప్రభుత్వం థాయిలాండ్ ఎగుమతి చేసే వస్తువులపై 19 శాతం సుంకం విధించిన విషయం మరింతగా ప్రభావం చూపించింది.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి థాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా భౌతిక Gold పై కొత్త పన్ను విధించేందుకు రెడీ అయింది. అయితే, ఈ పన్ను అన్ని రకాల బంగారంపై వర్తించదు. ఉదాహరణకు, అమెరికా డాలర్లలో బంగారం వ్యాపారం, ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజీలు, బులియన్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడం వల్ల మినహాయింపు పొందవచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ఒక పెద్ద సమస్య గురించి కూడా ఆందోళన చెందుతోంది.
పొరుగు దేశం కంబోడియాకు థాయ్ నుంచి బంగారం భారీగా ఎగుమతి అవుతోంది. ఇది సరిహద్దు వివాదాన్ని కూడా మరింతగా పెంచుతుంది. కంబోడియా, థాయిలాండ్ మధ్య గత కాలంలో సరిహద్దు సమస్యలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలో మరో కొత్త సవాలు ఎదురైంది. ఆగస్టులో పార్లమెంట్ రూ. 117 బిలియన్ల బడ్జెట్‌ను ఆమోదించింది. అలాగే, కేంద్ర బ్యాంక్ బలహీన వర్గాల ప్రజలకు ఉపశమనం కల్పించడానికి వడ్డీ రేట్లను గత రెండు సంవత్సరాల కంటే తక్కువ స్థాయికి నాల్గవసారి తగ్గించింది.
ఈ కీలకమైన చర్యల ద్వారా.. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడం, విదేశీ కరెన్సీ మార్పిడి వ్యవహారాన్ని నియంత్రించడం, వాస్తవ బంగారంపై మోసపూరిత ఉపయోగాలను నిరోధించడం లక్ష్యంగా థాయ్ ప్రభుత్వం పెట్టుకుంది. తద్వారా దేశానికి వచ్చిన నష్టాన్ని తగ్గించి, ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications