టెలికం రంగంలో కస్టమర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం మరింత పెరగాలని, ఇది రూ.300కు చేరుకోవాలని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల అన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) ఈ మేరకు చేరితేనే ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న టెలికం రంగం పునరుత్తేజానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మిట్టల్ ఆమెను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తక్కువ ధరకే సేవలు పొందుతున్నారు..
ఇప్పటికే దేశానికి చెందిన మొబైల్ కస్టమర్లు తక్కువ ధరకే సేవలు పొందుతున్నారని, భవిష్యత్తులోని ఇదే తరహా సేవలు పొందేందుకు ఆసక్తి కనబరుస్తారని సునీల్ మిట్టల్ అన్నారు. ఓ వైపు కస్టమర్ల ప్రయోజనాలు, మరోవైపు పెట్టుబడులు సమకూర్చుకోవడం కంపెనీలకు సమ ప్రాధాన్య అంశాలని చెప్పారు.

సగటు రూ.300కు చేరాలి
ప్రస్తుతం కొందరు వినియోగదారులు రూ.100 వినియోగిస్తుండగా, మరికొందరు రూ.450 నుంచి రూ.500 చెల్లిస్తున్నారన్నారు. ఈ సగటు కనీసం రూ.300కు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాలని కోరారు. వాయిస్ కాల్స్, డేటా విషయంలో ఫ్లోర్ ప్రైస్ (కనీస ధర)ను నిర్ణయించాలని ఇదివరకు ఆయన ట్రాయ్‌ని కోరారు.

రూ.200 ఆర్పు చేరేనా?
పెట్టుబడులు, కస్టమర్ల మధ్య సమతౌల్యత అవసరమని సునీల్ మిట్టల్ చెప్పారని, కానీ వచ్చే నాలుగేళ్లలో కూడా ఎయిర్‌టెల్ ఆర్పు రూ.200 కూడా సాధించలేదని నిపుణులు అంటున్నారు. 2022-23 నాటికి ఎయిర్ టెల్ ఆర్పు రూ.191 నుంచి రూ.196 వరకు ఉంటుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, 6వ తేదీ నుంచి జియో తమ టారిఫ్స్ పెంచాయి. ప్రీపెయిట్ టారిఫ్స్‌ను 15-50 శాతం మధ్య పెంచాయి. సుప్రీం కోర్టులో AGR దెబ్బ అనంతరం టారిఫ్స్ పెంచాయి. AGRలో దాదాపు 75 శాతంగా ఉన్న వడ్డీ, జరిమానాలపై పునఃసమీక్షించాలని టెల్కోలు సుప్రీం కోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఆర్పు రూ.200 చేరుకోవడానికి ఎన్నో అవరోధాలు ఉన్నాయని అంటున్నారు.

భారతీయ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు...
ముఖ్యంగా భారత్‌లో అధిక ధర విషయంలో సున్నితమైన మార్కెట్, ప్రపంచంలోనే చౌక టారిఫ్స్ ఉన్నప్పటికీ భారతీయ కస్టమర్లు ఇప్పటికే ప్రపంచ సగటు కంటే టెలికం సేవలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఓ రీసెర్చ్‌లో తేలింది. ఆర్థిక సంవల సంస్థ జెఫిరీస్ ప్రకారం భారత్‌లో ఆర్పు పర్ క్యాపిటా 1.1 శాతం కాగా, ప్రపంచవ్యాప్తంగా 0.9 శాతంగా ఉంది. అంటే ప్రపంచ సగటు కంటే మన వద్ద ఎక్కువగా ఉంది.

డేటా వాయిస్ సెగ్మెంట్స్‌కు డిమాండ్
భారత్‌లో డేటా, వాయిస్ సెగ్మెంట్స్‌కు డిమాండ్ ఉంది. మరింత టారిఫ్ పెరిగితే కస్టమర్లు తమ వినియోగాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఏ టెలికం సంస్థ అయినా మరింత టారిఫ్ పెంచే పరిస్థితుల్లో కస్టమర్లు తమ ప్లాన్స్ మార్చుకుంటారని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications