మధ్య తరగతి భారతీయ దంపతులు తమ పదవీ విరమణ తర్వాత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. వీరంతా గల్ఫ్ కంట్రీల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది మిడిల్ క్లాస్ భారతీయులు తమ పదవీ విరమణ డబ్బును దుబాయ్ లో రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తద్వారా అక్కడ లాభాలను ఆర్జిస్తూ.. రియల్ ఎస్టేట్‌ను స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్‌గా మారుస్తున్నారు. ఈ విషయాలను బెంగళూరుకు చెందిన సీఏ, ఒబెయా స్టార్టప్ ఫౌండర్ అభిషేక్ జమువార్ లింక్డ్ ఇన్ లో పంచుకున్నారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ మంది భారతీయ దంపతులు తమ రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బును అలాగే కూడబెట్టుకున్న డబ్బును యూఏఈలో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నారు. ఇక యూఏఈలోని భారతీయులు విభిన్న ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపారు. నేను ఇలా చెప్పడం మీకు కోపం కలిగించవచ్చు..క్షమించండి..అయితే దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టినవారితో పోలిస్తే భారీగా లాభాలను ఆర్జిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. దుబాయ్‌లో 2-3 ఆస్తులను కొన్న భారతీయ జంటలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

నేను చెబుతున్నది రికార్డుల కోసమో మరో దాని కోసమో కాదని.. పైగా సంపన్నుల గురించి అసలు మాట్లాడటం లేదని కేవలం మధ్యతరగతి జంటల గురించే మాట్లాడుతున్నానని జమువార్ తెలిపారు. తమ కెరియర్‌లో 10 నుంచి 15 సంవత్సరాలు శ్రమించిన భారతీయ జంటలు పొదుపు చేసిన డబ్బుతో దుబాయ్‌లో రెండు, మూడు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు. ఈ ప్రాపర్టీ ద్వారా వారు 6 నుంచి 7 శాతంగా అద్దె రూపంలో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే వారు ఆ ప్రాపర్టీని కేవలం 5% వడ్డీ రేటుతో కొన్నారని చెప్పుకొచ్చారు. వారు ఆదాయ వనరుతో పాటుగా పదవీ విరమణ ప్రణాళికలు ఉపయోగించుకుని ఆదాయం కోసం సిరాస్థుల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకొచ్చారు.

దుబాయ్ కన్నా ఇండియాలో పరిస్థితులు చాలా భిన్నగా ఉంటాయని దీనికి ప్రధాన కారణం వన్ హోమ్, ఎక్కువ ఈఎంఐలు, తక్కువ రిటర్న్స్ ఉండటమేనని తెలిపారు. భారత్ లో ఒక ఇంటి కొనుగోలుకు 10 శాతం కన్నా ఎక్కువగానే అప్పు చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే అంత అప్పు చేసినప్పటికీ వారికి రెంట్ల రూపంలో వచ్చే ఆదాయం కేవలం మూడు శాతం మాత్రమేనని తెలిపారు.దీంతో వారికి ఆర్థిక ఒత్తిడి పెరగడమే కాకుండా మొత్తం ఆదాయం ఈఎంఐలు కట్టడానికే సరిపోతుందని చెప్పుకొచ్చారు.
ఆయన అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే.. దుబాయ్‌లో ఆస్తి కొనడం వల్ల ఇంటిని సొంతం చేసుకోవడంతో పాటుగా అధిక ఆదాయాన్ని పొందుతారు. ఒత్తిడి లేకుండా జీవిస్తారు. అదే ఇండియాలో ప్రాపర్టీ కొంటే జీవితాంతం అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది. ఇదే రెండు దేశాల్లో ఆస్తులు కొనడం వల్ల వచ్చే తేడా అని చెప్పుకొచ్చారు. కాబట్టి మధ్య తరగతి జీవులు సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఆదాయ మార్గాలను చాలానే పెంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం పొదుపు మార్గాల్లో పెట్టుబడులు, లాభాలు వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. సొంతిళ్లుతో పాటు ఒత్తిడి లేకుండా జీవించడం, అప్పులు లేకుండా బతకడం వంటి వాటిని ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలని తెలిపారు.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications