మీరు సోషల్ మీడియాలో బాలీవుడ్ సెలబ్రిటీల ఎయిర్‌పోర్ట్ లుక్స్ లేదా పెళ్లి ఫోటోలను గమనించారా? గతంలో లాగా కళ్ళను మిరుమిట్లు గొలిపే మెరిసే బంగారు ఆభరణాలు ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాయి. 2026లో బంగారం మెరుపు తగ్గుతోంది. దానిపై ఉండే టెక్స్చర్ (Texture) కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇప్పుడు అంతా 'మ్యాట్ గోల్డ్' (Matte Gold) మాయలో ఉన్నారు. దీనినే ఫ్యాషన్ ప్రపంచంలో "క్వైట్ లగ్జరీ" (Quiet Luxury) అని పిలుస్తున్నారు.

షైనీ గోల్డ్ వర్సెస్ మ్యాట్ గోల్డ్: తేడా ఏంటి?
మనం సాధారణంగా బీరువాల్లో దాచుకునే 22 క్యారెట్ల బంగారం (Gold) ఆభరణాలు సహజంగానే ఎక్కువ మెరుపును కలిగి ఉంటాయి. కానీ, ఆధునిక జీవనశైలిలో ఈ మితిమీరిన మెరుపు కొన్నిసార్లు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రోడ్డు పక్కన దొరికే ఇమిటేషన్ లేదా గిల్ట్ నగలు కూడా విపరీతమైన మెరుపుతో ఉంటాయి. దీనివల్ల మీరు వేసుకున్న అసలైన భారీ బంగారు నగలు కూడా కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే, ఇప్పుడు ఫ్యాషన్ తెలిసిన వారు 'లౌడ్' గా ఉండే మెరుపు కంటే గంభీరంగా ఉండే మ్యాట్ ఫినిష్‌ను ఇష్టపడుతున్నారు.
'ఖందానీ' స్టైల్ అంటే ఇదే!
మ్యాట్ లేదా బ్రష్డ్ ఫినిష్ జ్యువెలరీకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నట్లు అనిపిస్తుంది. మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి పాత బంగారు గాజులు లేదా నెక్లెస్‌లను గమనిస్తే.. అవి దశాబ్దాల తరబడి వాడటం వల్ల వాటి మెరుపు తగ్గి, ఒక రకమైన వెచ్చని కాంతిని (Patina) కలిగి ఉంటాయి. మ్యాట్ ఫినిష్ నగలు ఈ 'వింటేజ్' లుక్‌ను తక్షణమే అందిస్తాయి.
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించే పెళ్లి నగలు కూడా మసకగా, పురాతనమైన ఫినిషింగ్‌తో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవి యంత్రాలతో పాలిష్ చేసినట్లు కాకుండా, చేత్తో చెక్కిన కళాఖండాల్లా కనిపిస్తాయి. ఇవే నిజమైన 'ఓల్డ్ మనీ' లేదా జనరేషన్స్ నుంచి వస్తున్న సంపన్నతకు నిదర్శనంగా నిలుస్తాయి.
భారతీయులకి మ్యాట్ గోల్డ్ సరిజోడి
మన టెంపుల్ జ్యువెలరీ (Temple Jewellery) లో ఎప్పటి నుంచో మ్యాట్ , ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌ను వాడుతున్నాం. ఇప్పుడు అదే ట్రెండ్ మోడ్రన్ డిజైన్లలోకి వచ్చింది.
- ఫ్లాటరింగ్ లుక్: మెరిసే బంగారం కాంతిని పరావర్తనం చెందిస్తుంది. కానీ, మ్యాట్ గోల్డ్ కాంతిని గ్రహించి చర్మ రంగుతో కలిసిపోతుంది. ఇది భారతీయ స్కిన్ టోన్‌కు చాలా రిచ్ లుక్‌ను ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
- మెయింటెనెన్స్: పాలిష్ చేసిన రింగులపై వేలిముద్రలు లేదా గీతలు వెంటనే కనిపిస్తాయి. కానీ మ్యాట్ లేదా హ్యామర్డ్ ఫినిష్ ఉన్న నగలు రోజువారీ వాడకంలో వచ్చే చిన్న చిన్న గీతలను దాచిపెడతాయి.
మ్యాట్ గోల్డ్ ను ఎలా ధరించాలి?
- స్టేట్‌మెంట్ కఫ్: మెరిసే గాజుల దొంతర కంటే, మ్యాట్ ఫినిష్ ఉన్న ఒకే ఒక వెడల్పాటి హ్యామర్డ్ గోల్డ్ కఫ్ ధరించండి. ఇది చీరలు , వైట్ షర్ట్స్ పైకి కూడా అద్భుతంగా ఉంటుంది.
- కాయిన్ నెక్లెస్: పాత కాలపు నాణేల వంటి నెక్లెస్ లు మ్యాట్ ఫినిష్‌లో ఉంటే అవి ఎంతో క్లాసీగా కనిపిస్తాయి.
- బ్రష్డ్ రింగ్స్: ఆఫీసు వేర్ కోసం బ్రష్డ్ ఫినిష్ ఉన్న సిగ్నెట్ రింగ్స్ వాడితే అవి ప్రొఫెషనల్ గా, పవర్‌ఫుల్ గా కనిపిస్తాయి.
మొత్తానికి మ్యాట్ గోల్డ్ అనేది గోల్డ్ స్టైలింగ్ లో కొత్త ట్రెండ్! ఇది చాలా కొంతమందికే తెలిసిన ట్రెండ్! ఇప్పుడిప్పుడే అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు. త్వరలోనే భారతీయ పెళ్లిళ్లలో వాడే నగలు కూడా ఇలా మ్యాటీ ఫినిష్ తో కనిపించే అవకాశం ఉంది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications