టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని, ఐఫోన్లు ఇండియాలోనే తయారవుతాయనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే చైనా మళ్ళీ తన తెలివితేటలను ప్రదర్శించింది. ఆదిలోనే భారతదేశంలో జరగాల్సిన ఐఫోన్ తయారీకి డ్రాగన్ కంట్రీ అడ్డుకట్ట వేసింది.ఆపిల్ ప్రధాన తయారీదారు అయిన ఫాక్స్‌కాన్...భారతదేశంలోని దాని తయారీ కేంద్రాల నుండి 300 మందికి పైగా చైనీస్ నిపుణులు, ఇంజనీర్లను స్వదేశానికి రావాలని ఆదేశాలు ఇచ్చింది. భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తికి కంపెనీ సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది భారతీయ యూనిట్లలో కార్యాచరణ సవాళ్లను సృష్టించింది.
భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచాలనే ఆపిల్ లక్ష్యం చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించడం వల్ల ప్రభావితమవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజనీర్లను చైనాకు పంపడం ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రభావితం చేసే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఈ పరిస్థితులు ఇలా ఉంటే భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి చైనా నుండి కీలకమైన పరికరాలను ఆపిల్ కంపెనీ దిగుమతి చేసుకోవాలి.

అయితే చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పరికరాలను చైనా నుండి బయటకు వెళ్లకుండా నిరోధించింది. వాటిని పోర్టులలో నిలిపివేసింది. ఈ రెండు కారణాలు భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని అడుకోవడానికి చైనా వేసిన ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఆపిల్ యొక్క అతిపెద్ద కాంట్రాక్టర్. ఈ కంపెనీకి తమిళనాడులోనే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఫాక్స్‌కాన్ ఇటీవల భారతదేశంలో 1,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీనితో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 40,000కి చేరుకుంది.
చైనా ప్రభుత్వం తన సాంకేతిక నిపుణులను విదేశాల్లోని పోటీ తయారీ కేంద్రాలకు వలస వెళ్లడాన్ని నిశ్శబ్దంగా నియంత్రిస్తోంది. సాంకేతిక బదిలీ, పరికరాల ఎగుమతులు మరియు నైపుణ్య భాగస్వామ్యంపై నిబంధనలను కఠినతరం చేస్తోంది, ఆంక్షలు విధిస్తోంది.భారతదేశం, వియత్నాం వంటి దేశాలు తమ సొంత సాంకేతిక ఆధారిత ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చైనా వైఖరి అడ్డంకిగా మారింది.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ చైనా నిపుణుల సామర్ధ్యాలను పదే పదే ప్రశంసిస్తూ వస్తున్నారు. వారు ఖర్చు పరంగానే కాకుండా నాణ్యమైన ఉత్పత్తికి అవసరమైన ఖచ్చితత్వంలో అనుభవజ్ఞులని వివరించారు. ఈ విషయంలో చైనా నిపుణులను వెనక్కి పిలిపించాలనే నిర్ణయం భారతదేశంలో ఫాక్స్‌కాన్ నియమించిన సాంకేతిక నిపుణుల కొరతకు దారితీస్తుంది.
భారతదేశంలో నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఫోన్ ప్లాంట్లు ప్రపంచ ఉత్పత్తిలో ఐదవ వంతు వాటాను కలిగి ఉన్నాయి. 2026 నాటికి భారతదేశంలో అదనపు యుఎస్-బౌండ్ ఐఫోన్‌లను తయారు చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సాంకేతిక మానవశక్తి లేకపోవడం వల్ల ఇది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఐఫోన్‌లలో 20 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయి. ఇక ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలు తమిళనాడులో తమ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేశాయి. ఫాక్స్‌కాన్ చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లోని తన ప్లాంట్‌లో ఐఫోన్‌లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది.
అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య బహుళజాతి కంపెనీలు తమ తయారీ స్థావరాలను భారతదేశంతో పాటుగా దక్షిణాసియా దేశాలకు మారుస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానాలకు చైనా ఆధిపత్యాన్ని నిరోధించడం ఈ విస్తరణ ప్రయత్నాలకు తీవ్రమైన సవాళ్లను ఎత్తి చూపుతోంది. ఇటీవలి దౌత్య చర్చలు ఉన్నప్పటికీ, చైనా-భారత్ సంబంధాలు కీలకమైన దశకు చేరుకున్నాయి.మరి ఈ దౌత్య చర్చలు ఎలా ముగుస్తాయో చూడాలి.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

EMI ట్రాప్‌లో పడకుండా ఐఫోన్ కొనడం ఎలా? నిపుణుల బెస్ట్ టిప్స్!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications