బంగారం ధరలు శుక్రవారం ఒక్కరోజు ఏకంగా రూ.1,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలలోను బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతం లేదా రూ.1,000 తగ్గి రూ.45,732 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 3 శాతం లేదా రూ.1500 తగ్గి రూ.47,337 పలికింది. అయితే సోమవారం ధరలు తిరిగి పెరిగాయి. ఎంసీఎక్స్‌లో రూ.46,100కు చేరుకుంది. ఈ రోజు బంగారం ధరలు రూ.400 నుండి రూ.500 మధ్య పెరిగింది.

నిన్న రూ.1000 తగ్గి, నేడు ఒక శాతం పెరిగి..
ఈ రోజు మధ్యాహ్నం గం.1.39 సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (డెలివరీ ఆగస్ట్ 5) 0.86 శాతం లేదా రూ.392 పెరిగి రూ.46,090కి చేరుకుంది. ప్రారంభంలో ధర రూ.46,600 చేరుకుంది. వెండి ధర కిలో రూ.47,570కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,682.57 డాలర్లకు చేరుకుంది.

బంగారం ధర హఠాత్తుగా ఎందుకు తగ్గింది
కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతుందనే అంచనాలు, అమెరికా జాబ్ నెంబర్స్ ప్రపంచ ఆర్థిక నిపుణులు ఊహించిన దాని కంటే వేగంగా మెరుగుపడుతుందనే సంకేతాలు, ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటుండటం వంటి కారణాలతో బంగారం ధరలు మొన్న రూ.1000 తగ్గాయి. ఈక్విటీ మార్కెట్లు కూడా క్రమంగా కోలుకుంటున్నాయి. కాబట్టి పెట్టుబడిదారులు తమ దారిని ఇప్పుడిప్పుడే సురక్షిత బంగారం నుండి మరల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అమెరికా ఉద్యోగ డేటా
శుక్రవారం అమెరికా ఉద్యోగ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం 2.5 మిలియన్ల మంది గత నెలలో కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలోని 14.7 శాతం నుండి మే నాటికి 13.3 శాతానికి పడిపోయింది. వివిధ దేశాలు షట్ డౌన్‌ను క్రమంగా ఎత్తివేస్తున్నాయి. ఇది కూడా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో రూ.1000కి పైగా పెరుగుదల
శుక్రవారం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతం పడిపోయి ఔన్స్ ధర 1688 డాలర్లు పలికింది. అయితే ఈ రోజు తిరిగి ధరలు పెరిగినప్పటికీ శుక్రవారం పెరిగిన తగ్గిన ధరతో పోలిస్తే తక్కువగానే పెరిగాయి. అయితే కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తు ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్నారు.
ఇక, మన దేశంలో బహిరంగ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర రూ.1000 వరకు పెరిగింది. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,100కు పైగా పెరిగి రూ.48,370కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా పెరిగింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications