ముంబై : కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్ధితుల్లో పెట్టుబడిదారుల చూపంతా బంగారం పైనే ఉంటోంది. ప్రస్తుతం బంగారం ధరలు, డిమాండ్ ఇతర పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

ప్రపంచ టాప్ 5 పెట్టుబడుల్లో బంగారం..
ప్రపంచ బంగారం కౌన్సిల్ తాజా అధ్యయనంలో అంతర్జాతీయంగా టాప్ 5 పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా బంగారం చోటు సంపాదించింది. 2016లో సగటున పెట్టుబడిదారులు తమ సంపాదనలో 28 శాతాన్ని పెట్టుబడిగా పెడితే.. 2019 నాటికి అది 33 శాతానికి చేరుకుంది.
బంగారం సులువుగా కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశమే ఎక్కువ మంది దీన్ని పెట్టుబడి మార్గంగా ఎంచుకునేందుకు కారణంగా తేలింది.

రిస్క్ ఎక్కువైనా, రాబడీ ఎక్కువే..
అంతర్జాతీయగా చూసినా, మన దేశంలో చూసినా బంగారంపై రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించే వారే ఉన్నారు. అయితే అదే సమయంలో రాబడీ ఎక్కువేనని వారు భావిస్తున్నట్లు తాజాగా తేలింది. పెట్టుబడి దారులు ఈ పచ్చలోహాన్ని ఆదాయ మార్గంగా, వెంటనే నగదు రూపంలో మార్చుకోగలిగిన సాధనంగా, భవిష్యత్ పెట్టుబడిగానూ భావిస్తున్నట్లు నిర్దారణ అయింది.

పెట్టుబడి సూచనలు, సలహాలు అక్కడే...
బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు జనం ఎక్కువగా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులపైనే ఆధారపడుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఈ సర్వే ప్రకారం స్నేహితులు, బంధువులు, సహ ఉద్యోగుల ద్వారా 50 శాతం మంది బంగారం కొనుగోలు చేస్తుండగా.. ఫైనాన్షియల్ వెబ్ సైట్లు, మొబైల్ యాప్ ల ద్వారా మరో 47 శాతం కొనుగోళ్లు జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. ఫైనాన్షియల్ పత్రికలు, మ్యాగజైన్ల ద్వారా కూడా 43 శాతం కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. టీవీల ద్వారా 39 శాతం, సోషల్ మీడియా ద్వారా 38 శాతం బంగారం కొంటున్నట్లు నిర్దారణ అయింది.

29 శాతం మంది బంగారమే కొనలేదట..
దేశీయంగా బంగారం పెట్టుబడి సాధనంగా ఉన్నప్పటికీ పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండే వారిలో ఇప్పటికీ 29 శాతం మంది బంగారం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కొనుగోలు చేయలేదని తాజాగా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు వారిలో బంగారం కొనుగోళ్లపై తగినంత పరిజ్ఞానం లేకపోవడం, మోసపోతామనే భయం, ఇతరత్రా కారణాలు కూడా ఉన్నట్లు తేలింది.

పరిజ్ఞానం లేకపోవడం వల్ల ప్రభావం..
బంగారం కొనుగోళ్లకు సంబంధించిన పరిజ్ఞానం అంతగా లేకపోవడం వల్ల దేశీయంగా చాలా మంది ఈ పచ్చలోహాన్ని కొనుగోలు చేయడం లేదని కూడా తాజాగా అధ్యయనం తేల్చింది. బంగారం కొనుగోలుకు తగినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల నెలకొంటున్న భయాలే ఇందుకు ప్రధాన కారణం. కానీ మారుతున్న పరిస్ధితుల్లో మార్కెట్ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల వల్ల బంగారం ఓ నిరంతర పెట్టుబడి సాధనంగా మారుతోందని అధ్యయనాల్లో వెల్లడైంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications