WHO funds: అమెరికా సహా ఏ దేశం ఎన్ని నిధులు ఇస్తుంది? పాకిస్తాన్ కంటే చైనా ఘోరం!

కరోనా మహమ్మారి నేపథ్యంలో WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)కు ఫండ్స్ విషయంలో ఇటీవల రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. WHO పక్షపాతం చూపిస్తోందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. చైనాకు ఫేవర్‌గా ఉందని వివిధ సందర్భాల్లో వివిధ దేశాలు, ఇతరులు కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమేనన్నట్లుగా ఇటీవల భారత్ భూభాగాన్ని చైనాకు చెందినదిగా కూడా WHO చూపించింది.

మేమే ఎక్కువ నిధులు ఇచ్చాం

మేమే ఎక్కువ నిధులు ఇచ్చాం

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు WHOకు తామే ఎక్కువగా నిధులు ఇచ్చామని ట్రంప్ మొదటి నుండి చెబుతున్నారు. చైనాకి WHO ప్రజాసంబంధాల ఏజెన్సీలా మారిందని, అందుకు సిగ్గుపడాలని ఇటీవల మండిపడ్డారు. WHOపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన అమెరికా, ఆ సంస్థకు నిధులను సైతం నిలిపేసింది. WHOకు అమెరికా 500 మిలియన్ డాలర్లు ఇస్తుండగా, చైనా కేవలం 38 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తోందని ట్రంప్ అన్నారు. చైనాపై సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రుణాలకు సంబంధించిన ఒప్పందాలను మాత్రం రద్దు చేయబోమన్నారు.

ఏ దేశం ఎన్ని నిధులు.. అమెరికా తర్వాత బిల్ గేట్స్ ఫౌండేషన్

ఏ దేశం ఎన్ని నిధులు.. అమెరికా తర్వాత బిల్ గేట్స్ ఫౌండేషన్

WHO విషయంలో అమెరికా - చైనా ఫండ్స్ విషయంలో వివాదం నేపథ్యంలో ఏ దేశం ఎంత ఇస్తుందో చూద్దాం... WHO వెబ్‌సైట్ ప్రకారం ఈ సంస్థ ఫండింగ్‌లో అమెరికా కాంట్రిబ్యూషన్ 14.67 శాతం ఉంటుంది. అత్యధిక నిధులు అగ్రరాజ్యం ఇస్తుంది. ఆ తరవాత బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ కాంట్రిబ్యూషన్ 9.76 శాతం ఉంది. గావి అలయన్స్ 8.39 శాతం ఉంది. గావి జెనీవాకు చెందిన పబ్లిక్-ప్రయివేటు పార్ట్‌నర్‌షిప్ ఆర్గనైజేషన్.

ఈ దేశాల నుండే అధిక ఫండ్స్

ఈ దేశాల నుండే అధిక ఫండ్స్

అమెరికా, బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్, గావి తర్వాత వరుసగా యూకే 7.79 శాతం, జర్మనీ 5.68 శాతం WHOకు నిధులు సమకూర్చుతాయి. 5 శాతానికి పైగా నిధులు ఇచ్చే దేశాలు ఇవి మాత్రమే. ఐక్య రాజ్య సమితికి చెందిన UNOCHA 5 శాతం నిధులు ఇస్తుంది. ప్రపంచబ్యాంకు 3.42 శాతం, రోటరీ ఇంటర్నేషనల్ 3.3 శాతం, యూరోపియన్ కమిషన్ 3.3 శాతం, జపాన్ 2.7 శాతం కాంట్రిబ్యూట్ చేస్తాయి. జపాన్ నుండి అమెరికా వరకు 2.7 శాతం నుండి 14.67 శాతం కాంట్రిబ్యూట్ చేస్తూ పెద్ద పాత్రను పోషిస్తున్నాయి.

మరి చైనా ఇచ్చే నిధులు ఎంత?

మరి చైనా ఇచ్చే నిధులు ఎంత?

ప్రపంచ దేశాల్లో అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలు తొలి రెండు స్థానాల్లో ఉంటాయి. అలాంటిది అమెరికా దాదాపు 15 శాతం ఇస్తుంటే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన డ్రాగన్ దేశం WHOకు కాంట్రిబ్యూట్ చేసే నిధులు అతి స్వల్పం కావడం గమనార్హం. కనీసం 1 శాతం నిధులు కూడా ఇవ్వని పరిస్థితి. చైనా నుండి వచ్చే కాంట్రిబ్యూషన్ కేవలం 0.21 శాతం మాత్రమే. అయితే ఇప్పుడు కరోనా కారణంగా అమెరికా నిలిపివేస్తానని హెచ్చరించడంతో బీజింగ్ ముందుకు రావడం వేరే విషయం.

భారత్, పాకిస్తాన్‌ల కంటే దారుణం

భారత్, పాకిస్తాన్‌ల కంటే దారుణం

WHOకు భారత్ కాంట్రిబ్యూషన్ 0.48 శాతం. ఫ్రాన్స్ 0.5 శాతం, పాకిస్తాన్ 0.36 శాతం అందిస్తుంది. చైనా 0.21 శాతంతో భారత్, పాకిస్తాన్‌ల కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. WHOకు ప్రధానంగా 4 మార్గాల్లో నిధులు వస్తాయి. ఇందులో స్వచ్చంధంగా వచ్చేవి 80 శాతం వరకు ఉంటాయి. మొత్తానికి WHO ఫండ్స్‌కు కారణమైన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా సహకారం 15 శాతం ఉంటే చైనా సహకారం కనీసం 25 శాతం కూడా లేదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+