మీకు ప్రతినేల జీతం వస్తుందా.. అలాగే మీ జీతం నుండి ప్రతినెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో కట్ ఆవుతుందా, అయితే ఈ వార్త మీకోసమే. ఏంటంటే ఉద్యోగులకు అత్యంత నమ్మకమైనది రిటైర్మెంట్ సేవింగ్స్ స్కిం. ఇది పన్ను మినహాయింపు కూడా ఇస్తుంది. ఒకవేళ మీరు మీ ఉద్యోగం మారినప్పుడు, మీ పాత EPF అకౌంట్ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు మీ ఉద్యోగాన్ని మారాకా, మీ పాత EPF అకౌంట్ కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయకపోతే పాత అకౌంట్ డబ్బులు మీకు వస్తాయా ? లేదా మీరు ఆ మొత్తాన్ని కోల్పోతారా ? ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి.

EPF అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఎం జరుగుతుంది: మీరు జాబ్ మారినప్పుడు మీ EPF అకౌంట్ ఆటోమేటిక్'గా కొత్త కంపెనీకి మారదు. మీరు EPFO మెంబర్స్ సర్వీస్ పోర్టల్ ద్వారా ట్రాన్స్ఫర్ ప్రక్రియను చేయాలి. పాత అకౌంట్లో డబ్బు జమ అయినంత కాలం మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అలాగే ఉంటుంది. కానీ చాలా మంది ఈ ప్రాసెస్ మరచిపోతారు లేదా పట్టించుకోకుండా వదిలేస్తారు. కొంతమంది పాత అకౌంట్ మొత్తం డబ్బులు వడ్డీ ఇస్తూనే ఉంటుందని అనుకుంటారు.పాత అకౌంట్ వడ్డీ ఉంటుందా : దీనికి సమాధానం అవును, కానీ మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. EPFO నియమాలు ప్రకారం అకౌంట్ ఇన్ యాక్టీవ్ ఉంటే చివరి డిపాజిట్ తర్వాత 36 నెలల వరకు వడ్డీ వస్తుంది. మూడు సంవత్సరాల పాటు అకౌంట్లో కొత్తగా PF డిపాజిట్ లేకపోతే లేదా మీరు ఉద్యోగాన్ని వదిలివేస్తే (రిటైర్మెంట్ లేదా ఉద్యోగం మానేయడం వంటివి), అకౌంట్ ఇన్ యాక్టీవ్'గా మారుతుంది. దీని తరువాత వడ్డీ ఆగిపోతుంది. ఉదాహరణకు, మీరు 2020లో మీ ఉద్యోగాన్ని మారితే మీ పాత అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే 2023 తర్వాత దానిపై వడ్డీ ఆగిపోతుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో EPF వడ్డీ రేటు 8.25%. కానీ మీరు మీ పాత అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే, మూడు సంవత్సరాల తర్వాత వడ్డీ పొందే అవకాశాన్ని కోల్పోతారు. ఇంకా మీరు పాత అకౌంట్ బదిలీ చేయకపోతే ఆ డబ్బు కూడా ఇన్ యాక్టీవ్ మారుతుంది. 2020లో ఉద్యోగాలు మారిన తర్వాత మీ పాత అకౌంట్ 2023 వరకు వడ్డీ లేకుండానే ఉందని అనుకుందాం. ఈ సమయంలో మీ కొత్త కంపెనీ కొత్త అకౌంట్లో PF జమ చేస్తున్నారు, కానీ పాత అకౌంట్లో ఉన్న డబ్బు నిలిచిపోయింది. దింతో మీరు వడ్డీ బెనిఫిట్ కోల్పోతారు. ఇది కాకుండా, పాత అకౌంట్లో KYC, బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ అప్ డేట్ చేయకపోతే డబ్బును విత్ డ్రా చేసే సమయంలో సమస్యలు ఉండవచ్చు.
మీరు మీ ఉద్యోగం మారితే వీలైనంత త్వరగా మీ EPF అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో చాలా ఈజీ. మీరు UAN ఇంకా ఆధార్‌తో EPFO పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనితో మీ డబ్బు అంతా ఒకే అకౌంటుకు జమ అవుతుంది ఇంకా మీకు వడ్డీ అందుతూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications