అసలేంటి ఈ నాన్ వెజ్ మిల్క్..అమెరికా మాంసాహార పాలను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది ?

What is Non-Veg Milk : భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు నాన్ వెజ్ పాలకు సంబంధించిన వివాదంతో నిలిచిపోయాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల మీద అమెరికా చేయాలనుకుంటున్న మాంసాహార పాల దాడిని మోదీ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పాలపై తమకు కొన్ని సాంస్కృతిక ఆందోళనలు ఉన్నాయని భారతదేశం వాదిస్తోంది. కాబట్టి అమెరికా డిమాండ్‌ను అంగీకరించలేమని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఇక అమెరికా దీనిపై మొండి పట్టుబడుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుగా ఇండియా ఉన్న నేపథ్యంలో వ్యవసాయం, పాల రంగంలో అమెరికా భారతదేశంలో ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది. భారతదేశంలో వ్యవసాయం, పాల ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో అమెరికా తన ఉత్పత్తులను ఇండియాలో దింపి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించాలని ప్రయత్నాలు చేస్తోంది.

దీనికి భారత్ గట్టిగానే బదులిస్తోంది. రైతులు నష్టపోతారంటూ భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో నెలకొన్న సాంస్కృతిక ఆందోళనల కారణంగా అమెరికా డిమాండ్‌ను అంగీకరించబోమని మోదీ సర్కారు స్పష్టంగా తేల్చి చెప్పింది.అమెరికా పాల ఉత్పత్తులు భారతదేశ సంస్కృతిని ప్రభావితం చేయకూడదని కోరుకుంటుంది.

Non-veg milk India US trade deal dairy imports controversy rennet in milk vegetarian milk debate US dairy products India cultural trade barriers India US dairy talks animal rennet issue non-veg milk explained - - - - vs

నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటి? : యుఎస్ నుండి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులకు కఠినమైన సర్టిఫికేషన్ నిబంధనలు విధించాలని భారత్ ప్రభుత్వం కోరుతోంది. ఆ నిబంధనలో ప్రధాన షరతు ఏమిటంటే ఆ పాలు ఇచ్చిన ఆవులకు ఎప్పుడూ మాంసం, రక్తం లేదా జంతు భాగాలపై ఆధారపడిన ఆహారం ఇవ్వకూడదు.కాగా అమెరికాలో ఆవులకు మాంసం కలిగిన ఆహారాన్ని తినిపిస్తారు.అమెరికాలో ఆవులకు పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లి లేదా కుక్క భాగాలను కూడా ఆవులకు తినిపిస్తున్నారు. కొవ్వు పెరగడానికి ప్రోటీన్, కొవ్వు కోసం వాటికి జంతువుల రక్తం కూడా ఇవ్వబడుతుందని తెలుస్తోంది. దీని అర్థం ఆవులకు ఇచ్చే ఆహారంలో తరచుగా జంతువుల అవశేషాలు ఉంటాయి.కొన్ని సందర్భాల్లో రక్తం లేదా ఎముకల నుండి తయారైన ప్రొటీన్లు కూడా ఆహారంలో చేర్చుతారు. దీని వలన అక్కడి పాల ఉత్పత్తులను 'నాన్-వెజ్ మిల్క్' అని పిలుస్తారు.

భారతదేశం ఎందుకు దీనిని వ్యతిరేకిస్తోంది: ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుగా ఇండియా ఉంది. భారతదేశంలో దాదాపు 38 శాతం మంది ప్రజలు శాకాహారులు. హిందూ మతంలో పాలు, నెయ్యి వంటి ఉత్పత్తులు పూజా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక ఆవుకు మాంసం లేదా రక్తం కలిసిన ఆహారం ఇచ్చి ఆ పాలు పూజకు ఉపయోగిస్తే దానిని పవిత్రంగా భావించరు.

అందుకే మోదీ సర్కారు దీనిని "నాన్ వెజ్ పాలు"గా పరిగణించి వ్యతిరేకిస్తోంది. 2023-24లో 239.30 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో ఈ రంగం దాదాపు 8 కోట్లకుపైగా ప్రజలకు ఉపాధిని కల్పిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో 2.5 నుంచి 3 శాతం జీడీపీ వాటాను ఈ పరిశ్రమ కలిగి ఉంది. దేశంలో కర్షకుల ఆదాయానికి ఇదే ప్రధాన వనరు.

భారతదేశంలో ఆవులకు ప్రధానంగా శాఖాహార ఆహారం ఇస్తారు. ఆవులు పొడి గడ్డి, పచ్చి మేత, మొక్కజొన్న, గోధుమ ధాన్యాలు తింటాయి. దీనితో పాటు వాటికి ఊకను తినిపిస్తారు. కొన్ని పెద్ద పాడి పరిశ్రమలు మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ పద్ధతులను అవలంబించడం ప్రారంభించినప్పటికీ దేశంలో మాంసాహార ఆహారం ఇప్పటికీ ఆమోదయోగ్యం కాదనే చెప్పుకోవాలి.

FSSAI ఏం చెబుతోంది: భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ 2021-22లో ఇదే విషయంపై ఒక నియమాన్ని ప్రతిపాదించింది. అది ఏంటంటే..పాల ఉత్పత్తిలో ఉపయోగించే పాలు జంతువుల ఆధారిత దాణా అయితే దానిని మాంసాహారం గుర్తుతో విక్రయించాలి. అయితే అమెరికన్ కంపెనీలు, ఇతర వాణిజ్య కంపెనీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.పాలు శాఖాహార ఉత్పత్తి ఎందుకంటే ఇది ఆవు శరీరం నుండి తయారవుతుందే కాని నేరుగా దాణా నుండి కాదని వారు వాదించారు. ఏదేమైనా ఈ విషయం దేశ సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది. దీనిపై మోదీ సర్కారు ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+