For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాధాకరం: CAAపై సత్య నాదళ్ల, కన్ఫ్యూజన్‍‌లో ఉన్నారు.. ప్లీజ్ చదవండి: మోహన్‌దాస్ పాయ్

|

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన CAA (పౌరసత్వ సవరణ చట్టం)పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల మొదటిసారి స్పందించారు. CAAపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ CAA వంటిది కావాలనుకున్నారని, వారు కావాలనుకున్న దానిని తాము అమలు చేస్తోన్నామని బీజేపీ చెబుతోంది. మరోవైపు, ఇది కొంతమందికి వ్యతిరేకంగా ఉందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పలుచోట్ల హింసకు కూడా దారి తీసింది. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల స్పందించారు.

ఈ రంగాల్లో 3 ఏళ్లలో 44% పెరిగిన ఉద్యోగాలుఈ రంగాల్లో 3 ఏళ్లలో 44% పెరిగిన ఉద్యోగాలు

ఇది విచారకరం.. సీఏఏపై సత్య నాదెళ్ల

ఇది విచారకరం.. సీఏఏపై సత్య నాదెళ్ల

ప్రస్తుతం జరుగుతోందని విచారకరమని, ఇది మంచిది కాదని వ్యాఖ్యానించారు. భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్‌వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈవో అయితే చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. అమెరికన్ జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు.

స్పష్టత రావాల్సి ఉందా?

స్పష్టత రావాల్సి ఉందా?

అయితే CAAను ఉద్దేశించి సత్య నాదెళ్ళ ఈ వ్యాఖ్యలు చేశారా లేక దాని కారణంగా జరుగుతున్న పరిణామాలపై ఇలా స్పందించారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చట్టబద్దమైన వలస విధానం గురించి ఆయన వ్యాఖ్యానించారని, దీని వల్ల ప్రతిభావంతులు సమాజ అభ్యున్నతికి అన్ని విధాలా సాయపడగలరనేది ఆయన ఉద్దేశ్యమని అంటున్నారు. బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు.

ప్రశంసించిన రామచంద్ర గుహ

ఆయన వ్యాఖ్యలపై ప్రముఖులు స్పందించారు. సత్య నాదెళ్ల తన అభిప్రాయం చెప్పినందుకు సంతోషంగా ఉందని, మన సొంత ఐటీ దిగ్గజాలకు ఇలా చెప్పే ధైర్యం, జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నానని, ఇప్పుడైనా చెప్పాలని రామచంద్ర గుహ ట్వీట్ చేశారు.

CAA చదివాక స్పందించాలి..

CAA చదివాక స్పందించాలి..

టీవీ మోహన్‌దాస్ పాయ్ కూడా ట్వీట్ చేశారు. అతని ప్రకటనలో కన్ఫ్యూజన్ ఉందని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ వామపక్షఅకడమిక్స్ అతనిని గందరగోళానికి గురి చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. దయచేసి కామెంట్ చేయడానికి ముందు సత్య నాదెళ్ల CAAని క్షుణ్ణంగా చదవాలని విజ్ఞప్తి చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా మిమ్మల్ని మేం గౌరవిస్తామని, అదే సమయంలో భారత్‌ను కించపరిచేలా కామెంట్ చేయకూడదని హితవు పలికారు.

ఇన్ఫోసిస్ సీఈవో కావొచ్చు

కార్తికేయ తన్నా అనే నెటిజన్ పెట్టిన ట్వీట్‌ను కూడా మోహన్‌దాస్ పాయి రీట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి చట్టబద్దంగా భారత పౌరసత్వం తీసుకోవడానికి ఇబ్బందులు లేవని, అంతేకాదు అలా వచ్చిన వారు సత్య నాదెళ్ల కోరుకున్నట్లుగా ఇన్ఫోసిస్ సీఈవో కూడా కావొచ్చునని అందులో ఉంది. ఇప్పుడు తెచ్చిన చట్టం హింసను ఎదుర్కొంటున్న మైనార్టీల కోసమని అందులో పేర్కొన్నారు.

English summary

బాధాకరం: CAAపై సత్య నాదళ్ల, కన్ఫ్యూజన్‍‌లో ఉన్నారు.. ప్లీజ్ చదవండి: మోహన్‌దాస్ పాయ్ | What is happening is sad: Satya Nadella, Mohandas Pai says he is confused

“I would love to see a Bangladeshi immigrant who comes to India and creates the next unicorn in India or becomes the next CEO of Infosys," Nadella was quoted as saying.
Story first published: Tuesday, January 14, 2020, 8:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X