India-US Trade Deal: భారత్ - అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్ జరిగిన సంగతి విదితమే. ఈ మేరకు రెండు దేశాలు కూడా సంయుక్త ప్రకటన చేశాయి. అయితే మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల సంయుక్త ప్రకటన వ్యవసాయ రంగంలో పలు మార్పులకు వేదికగా నిలుస్తోంది. వ్యవసాయ రంగంలో భారతదేశం తీసుకున్న జాగ్రత్తలు అలాగే ఇచ్చిన రాయితీలు ఓ సారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. అమెరికా నుంచి సోయాబీన్, మొక్కజొన్న, ఇంధన ఇథనాల్, పత్తి, పాల, పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులకు తన మార్కెట్‌ను ఇండియా ఇప్పటికీ తెరవలేదు. భారత రైతులు కోసం ముఖ్యంగా జన్యుమార్పిడి (GM) పంటలు, పాల ఉత్పత్తుల విషయంలో దేశం తీసుకున్న కఠిన వైఖరిని కొనసాగిస్తోందని మోదీ సర్కారు చెబుతోంది.

అయితే దీనర్థం ఏంటంటే.. పూర్తిగా ఏమీ ఇవ్వలేదని కాదు. భారత్ కొన్ని అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలు తగ్గించడం లేదా తొలగించడం ద్వారా అదనపు మార్కెట్ ఉత్పత్తులను మంజూరు చేసింది. ఇందులో డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సోల్యుబుల్స్ (DDGS), సోయాబీన్ నూనె, పశుగ్రాసం కోసం ఎర్ర జొన్న, చెట్ల గింజలు, తాజాగా ప్రాసెస్ చేసిన పండ్లు, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. అలాగే అదనపు ఉత్పత్తులు అనే అస్పష్ట పదాన్ని కూడా ఉపయోగించడం గమనార్హం.
మొదట్లో ఇవి భారత రైతులకు పెద్ద ముప్పుగా అనిపించకపోయినా.. DDGS విషయంలో పరిస్థితి అయితే అంత సులభం కాదు. DDGS అనేది మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి. ఇది ప్రోటీన్-రిచ్ పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం భారతీయ పౌల్ట్రీ, పాడి, ఆక్వా ఫీడ్ రంగాలు సోయాబీన్, పత్తిగింజలు, వేరుశనగ లేదా ఆవాల నుండి లభించే డీ-ఆయిల్డ్ కేక్‌పై ఆధారపడుతున్నాయి. ఇవి చాలా ఖరీదైనవి.
భారతదేశంలో సోయాబీన్ డీ-ఆయిల్డ్ కేక్ కిలో ధర రూ.43-44 ఉండగా.. దేశీయంగా తయారయ్యే బియ్యం లేదా మొక్కజొన్న DDGS ధర రూ.24-30 మధ్యలో ఉంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే DDGS ఇంకా తక్కువ ధరకు, మెరుగైన నాణ్యతతో లభించే అవకాశముంది. ముఖ్యంగా అఫ్లాటాక్సిన్ స్థాయిలు అమెరికన్ DDGSలో చాలా తక్కువగా ఉండటం వల్ల, పౌల్ట్రీ, పాడి రంగాలకు ఇది అనుకూలంగా మారవచ్చు.
దీంతో భారతీయ పశుసంవర్ధక రంగం లాభపడినా.. సోయాబీన్ రైతులు, నూనెగింజల ప్రాసెసింగ్ పరిశ్రమపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సోయాబీన్ నూనెపై దిగుమతి సుంకం 16.5 శాతం మాత్రమే ఉంది. అమెరికన్ సోయాబీన్ నూనెకు మరింత సులభ ప్రవేశం లభిస్తే.. దేశీయ ధరలు పడిపోవచ్చు. దీని ప్రభావం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోని లక్షలాది సోయాబీన్ రైతులపై పడే ప్రమాదం ఉంది.
అదేవిధంగా, పశుగ్రాసం కోసం ఎర్ర జొన్నపై సుంకాలు తగ్గితే.. ఇది పశుపోషణ రంగానికి లాభం చేకూర్చినా, దేశీయ జొన్న రైతులకు పోటీ పెంచుతుంది. అమెరికా ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద జొన్న ఉత్పత్తిదారు ఎగుమతిదారుగా ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ మధ్యంతర ఒప్పందంలో భారత్ కీలకమైన GM పంటలు, పాల ఉత్పత్తుల విషయంలో గట్టి రేఖ గీసింది. అయితే DDGS, సోయాబీన్ నూనె వంటి ఉత్పత్తుల ద్వారా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొంత మేర తలుపులు తెరిచింది. దీని లాభాలు పశుసంవర్ధక పరిశ్రమకు చేరినా.. నూనెగింజల రైతులకు దీర్ఘకాలంలో సవాళ్లుగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేము.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications