ఐటీ రైడ్స్ గురించి మనం టీవీ న్యూస్ ఛానెల్స్'లో సాధారణంగా చూస్తుంటాం... ఐటి రైడ్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. ఏదైనా అవినీతి లేదా ఆదాయానికి మించి అక్రమ సంపద ఉన్న వారి పై సరైన సమాచారం ద్వారా ఈ దాడులు జరుగుతాయి. అయితే ఇలాంటి సమయంలో చాల మందికి ఉండే ఆలోచన అసలు ఇంట్లో ఎంత మొత్తంలో డబ్బు ఉంచుకోవడం చట్టవిరుద్ధం... మీరు ఎంత మొత్తం వరకు డబ్బు ఇంట్లో పెట్టుకోవచ్చు దానిపై పరిమితి ఉంటుందా ? ఆదాయపు పన్ను చట్టం ఎం చెబుతుంది, నియమాలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఏంటి ? ఇవన్నీ కూడా చాలా మంది మదిలో ఉండే ప్రశ్నలు...

ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచుకోవడం నేరమా: తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నుండి స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న కాలిపోయిన నోట్లను చూపించే ఓ వీడియోను వైరల్ అయ్యింది. అయితే, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మాత్రం తన ఇంటి నుండి ఎటువంటి డబ్బు స్వాధీనం చేసుకోలేదని ఖండించారు. ఈ ఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది. డబ్బు బ్లాక్ మని కాకపోయినా కూడా ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవడం చట్టవిరుద్ధమా ?
ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతుంది: ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు అనే దానిపై ఆదాయపు పన్ను చట్టం ఎటువంటి పరిమితి పేర్కొనలేదు . దీని అర్థం మీరు మీకు కావలసినంత డబ్బు ఇంట్లో ఉంచుకోవచ్చు. ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఇదే వర్తిస్తుంది. వీరికి ప్రత్యేక మినహాయింపు లేదా పరిమితి అంటూ లేదు. అయితే, కొన్ని షరతులు తప్పక పాటించాలి.
*మీ డబ్బు చట్టపరమైన మార్గాల నుండి వచ్చి ఉండాలి ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో చూపించి ఉండాలి *మీ డబ్బుకి సాక్ష్యం లేదా ఆధారాలు మీరు నిరూపించలేకపోతే ఆ మొత్తం అక్రమ ఆదాయంగా పరిగణించబడుతుంది అలాగే పన్ను జరిమానాలకు లోబడి ఉంటుంది.
నగదు పరిమితులకు సంబంధించి ఆదాయపు పన్ను సెక్షన్స్: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 68 నుండి 69B వరకు, ఒక వ్యక్తి తన ఆదాయాన్ని వివరించడంలో విఫలమైతే అధికారులు దర్యాప్తు చేయవచ్చు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బుకి న్యాయమైన వివరణ అందించలేకపోతే, దానిని లెక్కలలోకి రాని డబ్బుగా పరిగణిస్తారు, ఇంకా తీవ్రమైన పన్ను చిక్కులు ఎదురవుతాయి.
రూల్స్ ఉల్లంఘిస్తే ఎం జరుగుతుంది: ఇన్వెస్టిగేషన్ సమయంలో పన్ను అధికారులు నివేదించని డబ్బు కనుగొంటే భారీ శిక్షలు విధించవచ్చు ఇంకా లెక్కల్లో చూపని డబ్బు రికవరీ చేసుకోవచ్చు అంతేకాక చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సాధారణంగా జరిగే ఆదాయపు పన్ను దాడుల్లో తరచుగా పెద్ద మొత్తంలో నివేదించని డబ్బు బయటపడుతుంది, అప్పడు రికవరీ అండ్ కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా జరుగుతాయి.
ఇంట్లో డబ్బు ఉంచుకోవడం చట్టవిరుద్ధం కాదు, కానీ ఆ డబ్బు చట్టబద్దంగా సంపాదించి లేదా న్యాయమైన మార్గాల ద్వారా వచ్చి ఉండాలి. నల్లధనం, పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం నిరంతరం చర్యలను బలోపేతం చేస్తోంది , కాబట్టి సరైన ఆర్థిక రికార్డులు మైంటైన్ చేయడం చాలా అవసరం. మీ దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉంటే అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి దానిని ఇంట్లో పెట్టుకోవడానికి బదులుగా బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా చట్టపరమైన వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిది .


Click it and Unblock the Notifications