న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం, ఫిబ్రవరి 1) ఉదయం గం.11 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. స్వతంత్ర చరిత్రలో తొలిసారి ఈసారి బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా పార్లమెంటుకు సమర్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ డాక్యుమెంట్స్ ముద్రణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్ పత్రాలకు బదులు ల్యాప్‌టాప్‌తో పార్లమెంటుకు బయల్దేరారు.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ బృందం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసింది. అనంతరం పార్లమెంటుకు బయలుదేరారు. నిర్మల చేతిలో సంప్రదాయ బడ్జెట్ ప్రాలకు బదులు మేడిన్ ఇండియా ట్యాబ్ ఉంది. గతంలో బడ్జెట్ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్ సూట్‌కేసుల్లో తీసుకు వచ్చేవారు. 2019, 2020లో నిర్మలా సీతారామన్ సంప్రదాయ వస్త్రం లాంటి సంచిలో బడ్జెట్ పత్రాలు తెచ్చారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ట్యాబ్‌లో బడ్జెట్‌ను తీసుకు వస్తున్నారు.

నిర్మలమ్మ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కరోనా తర్వాత ఆర్థిక వృద్ధి మెరుగ్గా కనిపించినప్పటికీ దేశంలో ఉపాధి ఇంకా కరోనా ముందుస్థాయికి చేరుకోలేదు. నిరుద్యోగాలు పెరుగుతున్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) తెలిపింది. డిమాండ్ భారీగా క్షీణించిందని, వినియోగం పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కీలకమైన వృద్ధి కేంద్రీకృత రంగాలలో పెట్టుబడులను పెంచడం మరో అంశం. నిర్మలమ్మ ముందు ఇలా పలు సవాళ్లు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications