ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ FY23 మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత BSEలో శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడ్‌లో ఆ కంపెనీ షేర్లు 4శాతం పడిపోయాయి. రూ.454 నుంచి రూ.443కి చేరుకుంది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం జనవరి-మార్చి కాలానికి 26% పెరిగి రూ.235 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.186 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో కొత్త బిజినెస్ ప్రీమియం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,788 కోట్లతో పోలిస్తే 18% పెరిగి రూ.5,635 కోట్లకు చేరుకుంది.
మార్చి త్రైమాసికంలో కొత్త వ్యాపారం (VNB) విలువ 36% వృద్ధితో రూ.1,055 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.775 కోట్లుగా ఉంది. FY23 పూర్తి సంవత్సరానికి, లాభదాయకతను సూచించే VNB సంవత్సరానికి 28% (YoY) వృద్ధితో రూ. 2,765 కోట్లకు పెరిగింది.2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఈక్విటీ షేర్‌కి 0.60 రూపాయల తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 15 శాతానికి పైగా క్షీణించింది.

మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీపై గోల్డ్‌మన్ సాచ్స్ తన న్యూట్రల్ రేటింగ్‌ను కొనసాగించింది. అయితే టార్గెట్ ధరను రూ.460 నుండి రూ.490కి పెంచింది. JP మోర్గాన్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ పోస్ట్ Q4 ఫలితాలపై తన తటస్థ వైఖరిని కొనసాగించింది. అయితే దాని టార్గెట్ ధరను రూ.440 నుండి రూ.480కి పెంచింది.
మోర్గాన్ స్టాన్లీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో దాని ఓవర్ వెయిటేజ్ రేటింగ్‌ను రూ. 600 టార్గెట్ ధరతో కొనసాగించింది.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌లో దాని యాడ్ రేటింగ్‌ను రూ.540 టార్గెట్ ధర ఇచ్చింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధరల నుండి 20% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను చూపుతుంది. "IPRU, ఆరోగ్యకరమైన VNB మార్జిన్‌లతో పాటుగా ఊహించిన దానికంటే ఎక్కువ APE వృద్ధిని నమోదు చేసింది" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ పేర్కొంది.
Note: ఈ వార్త కేవలం నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇచ్చాయి. దీనికి గుడ్ రిటర్న్స్ తెలుగుకు సంబంధం లేదు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. వీటిలో పెట్టుబుడలు పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications