2026లో బంగారం ధర రూ. 4 లక్షలు దాటుతుందా? గోల్డ్ కౌన్సిల్ షాకింగ్ రిపోర్ట్!
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన అంచనాల(WGC Gold Outlook 2026) ప్రకారం రాబోయే సంవత్సరం 2026లో బంగారం (Gold) ధరల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం ఉందట. దీనికి చాలానే బలమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) వచ్చే ఎడాది 2026 లో గోల్డ్ రేట్లు ఎలా మారతాయి అనే అంశంపై రెండు రకాల అంచనాలు వేసింది. ఈ రెండు అంచనాలకు బలమైన కారణాలు కూడా చూపింది.
భారీగా పెరగొచ్చు
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) మొదటి అంచనా ప్రకారం బంగారం ధరలు భారీగా పెరగొచ్చు. దానికి గల కారణాలు..
- ETF ఫ్లో: ప్రస్తుతం బంగారం ETFలు (Exchange Traded Funds) గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ.. గత బుల్ మార్కెట్లతో పోలిస్తే ఈ ETFలలో పెట్టుబడుల ప్రవాహం తక్కువగా ఉంది. అంటే.. ఆర్థిక అనిశ్చితి కొనసాగితే.. పెట్టుబడిదారులు ETFs ద్వారా మరింత బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. తద్వారా ధరలు పెరుగుతాయి.
- అనిశ్చితి కొనసాగితే: భయంకరమైన ఆర్థిక పరిస్థితులు లేదా ప్రపంచవ్యాప్త అనిశ్చితి కొనసాగితే.. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతారు. దీనివల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ధరలు పడిపోవచ్చు!
ఇకపోతే WGC రెండో అంచనా ప్రకారం బంగారం ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. దానికి గల కారణాలు..
- ఆర్థిక వృద్ధి పెరిగితే: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా బలంగా పుంజుకుంటే, అప్పుడు అసలు దిగుబడి పెరిగి, అమెరికన్ డాలర్ బలోపేతం అవుతుంది. తద్వారా బంగారం ధరలు తగ్గొచ్చు.
- పెట్టుబడిదారుల వైఖరి: ఇలాంటి వాతావరణంలో పెట్టుబడిదారులు అధిక రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఈక్విటీలు (షేర్లు), బాండ్లు లేదా ఇతర వడ్డీనిచ్చే ఆస్తులవైపు పెట్టుబడులు మళ్లిస్తారు. తద్వారా గోల్డ్ రేట్స్ తగ్గొచ్చు.
అంచనా వేయలేము..
మొత్తంగా WGC తో పాటు HSBC వంటి కొన్ని బ్యాంకులు కూడా 2026 నాటికి ఔన్స్‌కు 5,000 డాలర్లు (సుమారు తులం రూ. 4.2 లక్షలు) వరకు చేరుకోవచ్చని అంచనా వేశాయి. గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs) కూడా ఔన్స్‌కు 4,900 డాలర్లు వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు ధరలు తగ్గే అవకాశమూ కనిపిస్తోంది. ఆఖరికి WGC కూడా దీన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతోంది. WGC Gold Outlook 2026.. కేవలం వివిధ పరిస్థితులను బట్టి ధరలు ఏ వైపు కదలవచ్చో అంచనా వేసింది. అంటే బంగారం ధరలు పెరుగుతాయో లేదా తగ్గుతాయో గ్యారెంటీ లేదు. అంటే రిస్క్ ఉందన్నమాట. కాబట్టి ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications