ఉద్యోగాలు ఊడుతున్న వేళ రూ.80 లక్షల జీతం.. టెక్కీ కనిపెట్టిన ఆ సీక్రెట్ ఫార్ములా ఇదే..

ప్రస్తుతం గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో ఎక్కడ చూసినా లేఆఫ్స్ (layoffs) గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తుండటంతో ప్రొఫెషనల్స్‌లో ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక మహిళ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించి అద్భుతం చేసింది. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో తన వార్షిక వేతనాన్ని రూ.10 లక్షల (10 LPA) నుండి ఏకంగా రూ.80 లక్షలకు (80 LPA) పెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. రిమోట్ వర్క్ చేస్తూ ఆమె సాధించిన ఈ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

WFH woman uses ChatGPT to boost salary from 10 LPA to 80 LPA amid layoffs job market

ఎవరా మహిళ? ఆమె స్ట్రాటజీ ఏంటి?

ఆమె పేరే రీతూ మౌర్య. ఉద్యోగాల కోత విపరీతంగా ఉన్న ఈ కాలంలో, వేలాది మంది దరఖాస్తుదారుల మధ్య కేవలం ఒక సాధారణ రిజ్యూమ్ (CV) పంపిస్తే జాబ్ రావడం కష్టమని ఆమె గ్రహించింది. అందుకే కంపెనీలు మనల్ని ఇంటర్వ్యూకి పిలిచే కంటే ముందే.. "నాకు ఈ పని వచ్చు" అని ప్రాక్టికల్‌గా నిరూపించే కొత్త పంథాను ఎంచుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ సహాయంతో ప్రాజెక్ట్‌లు బిల్డ్ చేసి, నేరుగా హైరింగ్ మేనేజర్లను సంప్రదించి ఈ భారీ ప్యాకేజీని సొంతం చేసుకుంది. ఆమె చెప్పిన ఆ 4 సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్టెప్ 1: టార్గెట్ కంపెనీని ఎంచుకోవడం

మొదటగా మనకు నచ్చిన, పని చేయాలనుకునే ఒక డ్రీమ్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంపెనీలో ప్రస్తుతానికి ఉద్యోగ ఖాళీలు (Hiring) లేకపోయినా పర్వాలేదు. అక్కడ మన స్కిల్స్‌కు సరిపోయే జాబ్ డిస్క్రిప్షన్‌ను నిశితంగా పరిశీలించాలి. ఆ రోల్ ద్వారా కంపెనీ ఏ సమస్యలను పరిష్కరించాలని చూస్తోందో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.

స్టెప్ 2: ChatGPT తో ప్రాజెక్ట్ ఐడియా

జాబ్ ప్రొఫైల్‌ను విశ్లేషించిన తర్వాత, ఆయా రోల్స్‌కు ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ ఐడియాను జనరేట్ చేయడానికి చాట్‌జీపీటీ (ChatGPT) ని వాడాలి. కంపెనీ ఎదుర్కొనే నిజమైన సవాళ్లకు పరిష్కారం చూపేలా ఎలాంటి ప్రాజెక్ట్ చేయవచ్చో ChatGPT ద్వారా ఐడియాలు, స్టెప్-బై-స్టెప్ గైడెన్స్‌ను రీతూ మౌర్య సేకరించింది.

స్టెప్ 3: AI టూల్స్‌తో ప్రాజెక్ట్ బిల్డింగ్

ఐడియా వచ్చాక, కోడింగ్ లేదా టెక్నికల్ నాలెడ్జ్ తక్కువగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని రీతూ చెబుతోంది. ఆమె ఇందుకోసం 'Emergent.sh' లాంటి AI డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్ సహాయం తీసుకుంది. కోడింగ్ రాయడం, డీబగ్గింగ్ చేయడం, ప్రోటోటైప్ సిద్ధం చేయడం వంటి పనులన్నీ AI టూల్స్ ద్వారా సులువుగా పూర్తి చేయవచ్చు. అయితే మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్ అవుట్‌పుట్ రాదని, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ దాన్ని మరింత మెరుగుపరచాలని ఆమె సూచించింది.

స్టెప్ 4: మేనేజర్లకు డైరెక్ట్ మెసేజ్.. లింక్డ్‌ఇన్ వాడకం!

ప్రాజెక్ట్ పూర్తయ్యాక, రిక్రూటర్లు ఎప్పుడు చూస్తారా అని వెయిట్ చేయకుండా.. లింక్డ్‌ఇన్ (LinkedIn) లో సదరు కంపెనీ హైరింగ్ మేనేజర్లకు నేరుగా మెసేజ్ పంపాలి. తాము చేసిన ప్రాజెక్ట్ కంపెనీకి ఎలా ఉపయోగపడుతుందో వివరించాలి. అంతేకాదు, ఆ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న వీడియో (Walkthrough) చేసి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసి, ప్రొఫైల్‌కు పిన్ చేయాలి.

మార్కెట్లో లేఆఫ్స్ (layoffs) నడుస్తున్న ఈ రోజుల్లో పొడవైన రిజ్యూమ్‌ల కంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. AI టూల్స్ కేవలం కంటెంట్ రాయడానికే కాదు, ఇలా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చని రీతూ మౌర్య నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+