ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ రెండు దేశాలకు ఎగుమతులు, దిగుమదులపై తీవ్రప్రభావం చూపుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడనుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధరల పెరుగుదల నుండి ముడి చమురు ధరల బిల్లుల వరకు పెరిగే అవకాశాలున్నాయి. రష్యాకు ఎగుమతులపై కవరేజీని ఉపసంహరించాలని ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ తాజాగా నిర్ణయించింది. ఇది 25వ తేదీలోకి అమల్లోకి రాగా, ఎగుమతిదారులకు ఈ నిర్ణయం ఎదురుదెబ్బగా పరిశ్రమ సంఘం అభిప్రాయపడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో దిగుమతులపై ప్రభావం ఉంటుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) ఆందోళన వ్యక్తం చేసింది.

స్విఫ్ట్ ప్రత్యామ్నాయం
స్విఫ్ట్ నుండి రష్యా ప్రధాన బ్యాంకుల తొలగింపు నేపథ్యంలో భారత్, చైనా దేశాలకు వారి స్వదేశీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఒక మార్గంగా భావిస్తున్నారు. ఇప్పటికే రష్యా అంతర్గతంగా ఎస్పీఎఫ్ఎస్ సిస్టంను ఉపయోగిస్తుంది. 2015లో ఇలాగే స్విఫ్ట్ నుండి తొలగిస్తామని హెచ్చరికలు వచ్చిన తర్వాత ఎస్పీఎఫ్ఎస్ సిస్టం అభివృద్ధి చేసింది రష్యా. చైనా కూడా సొంతగా సీఐపీఎస్ సిస్టంను అభివృద్ధి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ కూడా స్విఫ్ట్ ప్రత్యామ్నాయం యోచిస్తుందని అంటున్నారు.

భారత్ ఎగుమతులు
భారత్ నుండి రష్యాకు, సీఐఎస్ దేశాలకు ఎగుమతుల వ్యాల్యూ 500 మిలియన్ డాలర్లుగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రభావం మన ఎగుమతులపై పడింది. ఆ దేశాల నుండి సన్ ఫ్లవర్ ఆయిల్ సహా వివిధ దిగుమతులు కూడా లేకపోవడంతో ఈ ధరలు పెరుగుతున్నాయి. భారత్ ఏటా 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను రష్యాకు, 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS) దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో ఎక్కువగా వ్యాపారం రష్యా ద్వారా జరుగుతుంది.

రవాణా రేట్ల పెరుగుదల
ఇప్పుడు పోర్టుల మూసివేత కారణంగా సరకు రవాణా రేట్లు మరింత పెరుగుతాయని వ్యాపారులు ఇప్పటికే భయపడుతున్నారు. ఇప్పటికే కంటైనర్ రేట్లు ఏడాది క్రితం కంటే 81 శాతం అధికంగా ఉన్నాయి. ఈ వాణిజ్యం డాలర్లలో జరుగుతుంది. రష్యాతో యూరోస్, పౌండ్స్‌లో వాణిజ్యం సంక్లిష్టమేనని అంటున్నారు. రష్యన్ దిగుమతిదారులు తమ దేశ కరెన్సీ రూబుల్స్‌లో ట్రాన్సాక్షన్ చేసేందుకు అంగీకరిస్తారు. డాలర్ వాణిజ్యంపై ఉన్న ప్రోత్సాహకాలు వీటిలో ఉండవని అంటున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications