ఉక్రెయిన్ పైన యుద్ధం నేపథ్యంలో రష్యా పైన అమెరికా, యూరోపియన్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ (SWIFT) నుండి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పలుమార్లు యూరోప్ దేశాలను కోరారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాను స్విఫ్ట్ నుండి తొలగించాలని అమెరికా, యూరోప్ దేశాలు అంగీకరించాయి. స్విఫ్ట్ నుండి రష్యా తొలగింపు నిర్ణయంపై జర్మనీ వెల్లడించింది.

వీరికి బంద్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆంక్షల్లో భాగంగా స్విఫ్ట్ నుండి తొలగించినట్లు తెలిపింది జర్మనీ. యుద్ధానికి మద్దతు ఇవ్వడంలో రష్యా సెంట్రల్ బ్యాంకు పాత్రను తగ్గించడం లక్ష్యంగా ఈ ఆంక్షలు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, బ్రిటన్, యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా బిలియనీర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉండే గోల్డెన్ పాస్‌పోర్ట్స్ వర్క్ చేయవు.
అలాగే, రష్యాకు మద్దతు ఇచ్చే కొందరు వ్యక్తులు, సంస్థలను కూడా ఈ ఆంక్షలు టార్గెట్ చేస్తాయి. ఉక్రెయిన్ పైన యుద్ధం ద్వారా యూరోపియన్ శాంతి ఆదేశాలకు రష్యా విఘాతం కలిగించిందని, యుద్ధం ఆపకుంటే మరిన్ని చర్యలు ఉంటాయని జర్మనీ ప్రకటించింది.

రష్యా, చైనా సొంత సిస్టం
స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ నుండి రష్యన్ ప్రధాన బ్యాంకులను తొలగించడంపై యూరోపియన్ దేశాల ప్రకటన భారత్, చైనా తమ స్వదేశీ వ్యవస్థలు లేదా ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఓ అవకాశమని అంటున్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు స్విఫ్ట్ నుండి కత్తిరించబడ్డాయి. పశ్చిమ దేశాలు 2015లో స్విఫ్ట్ సిస్టంను నిలిపివేస్తామని హెచ్చరించడంతో రష్యా అంతర్గతంగా ఎస్పీఎఫ్ఎస్ వ్యవస్థను ఉపయోగిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సమాచార ప్రవాహం కోసం చైనా కూడా తన సొంత సీఐపీఎస్ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేసింది. కానీ ఇవి అంతగా ముందుకు సాగడం లేదు.

ఎగుమతుల్లో ఇబ్బందులు
ఇదిలా ఉండగా, రష్యాకు చేసే ఎగుమతులపై కవరేజీని ఉపసంహరించాలని ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (ECGC) నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుండి ఇది అమలులోకి రాగా, ఎగుమతిదారులకు ఈ నిర్ణయం ఎదురుదెబ్బగా ఎఫ్ఐఈవో అభిప్రాయపడింది. ఈ యుద్ధం ప్రభావం సన్ ఫ్లవర్ ఆయిల్ పైన ఉంటుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) ఆందోళన వ్యక్తం చేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications