భారత్‌పై నీటి నియంత్రణ? చైనా డ్యామ్ ప్రాజెక్టుతో పెరుగుతున్న పర్యావరణ ప్రమాదాలు!
చైనా టిబెట్‌లో భారీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. యార్లుంగ్ జాంగ్పో నది లోయ వద్ద దాదాపు $167 బిలియన్ పెట్టుబడితో ఈ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించడం పై పలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇది విద్యుత్తు ఉత్పత్తికి మాత్రమే కాదు, భారతదేశం భద్రత, నీటి ప్రవాహం, పర్యావరణంపై కూడ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్, టిబెట్‌లోని నైంగ్‌చి నగరంలో ఈ డ్యామ్ నిర్మాణాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు.
చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్హువా తెలిపిన ప్రకారం, ఈ ప్రాజెక్టును యాజియాంగ్ గ్రూప్ అనే కొత్త సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది చైనాలో ఇప్పటివరకు చేపట్టిన అత్యంత ఖరీదైన మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటిగా పరిగణించబడుతోంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఈ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఐదు కాస్కేడ్ డ్యామ్‌లు ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే విద్యుత్తులో కొంతమేరను స్థానిక వినియోగానికి వినియోగించగా, ప్రధానంగా ఎగుమతుల కోసమే వినియోగించనున్నారు. అయితే ప్రాజెక్ట్ యొక్క పూర్తి సామర్థ్యం ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు.
ఈ డ్యాం నిర్మాణం యార్లుంగ్ జాంగ్‌పో నదిపై చేపట్టబడుతోంది. ఇదే నది భారత్‌లో ప్రవేశించి బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. ఇందువల్ల ఈ ప్రాజెక్ట్ భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అంశమైంది. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలు ఇప్పటికే ఉద్వేగభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇది మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
చైనా ఈ ప్రాజెక్ట్ దిగువ దేశాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నా, భారత ప్రభుత్వం దీనిపై నమ్మకాన్ని వ్యక్తం చేయకుండా, పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది.
పర్యావరణపరమైన ఆందోళనలు:
యార్లుంగ్ జాంగ్‌పో లోయ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన జీవవైవిధ్య ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 31 మైళ్ల పొడవులో నది 6,500 అడుగుల ఎత్తు నుంచి పతనమవుతుంది, ఇది అతి అరుదైన పర్యావరణ గుణాలతో కూడిన ప్రాంతం. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రకృతి సంరక్షణ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. పర్యావరణవేత్తలు ఇప్పటికే దీని వల్ల పర్యావరణం, జంతువుల తీవ్రంగా ప్రభావితమవుతాయని చాలా సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక వృద్ధికి బలమైన మద్దతు ఇవ్వాలన్న లక్ష్యంతో చైనా ఈ డ్యామ్ లాంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. ఈ డ్యామ్ పూర్తయిన తర్వాత, చైనాకు శక్తి భద్రతను పెంపొందించడంలో, అలాగే టిబెట్ వంటి ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఇది కీలకపాత్ర పోషించనుంది.
చైనా నిర్మిస్తున్న ఈ భారీ డ్యాం భారతదేశానికి పలు మార్గాల్లో ఆందోళనకరంగా మారుతోంది. ఇది కేవలం విద్యుత్తుకు సంబంధించిన విషయం కాదు, జలవనరులపై నియంత్రణ, పర్యావరణ ధ్వంసం, సార్వభౌమత్వం, మరియు వ్యూహాత్మక భద్రత వంటి అంశాలను ప్రభావితం చేయగలిగే ప్రాజెక్ట్. కనుక, భారత్ ఈ అభివృద్ధిపై మరింత జాగ్రత్తగా, ఆర్థిక-రాజకీయ-పర్యావరణ కోణాల్లో బలమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
చైనా డ్యాం నిర్మాణం వల్ల భారత్‌కు ఎదురయ్యే సమస్యలు:
యార్లుంగ్ జాంగ్పో నది టిబెట్‌లో ప్రవహించి, భారతదేశంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. ఎగువన (ఉపరి) చైనా డ్యాం నిర్మిస్తే, నీటి విడుదల తమ కంట్రోల్‌లో ఉంటుంది. దీని వల్ల భారత రాష్ట్రాలలో, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగాల్ వంటి రాష్ట్రాల్లో నీటి సరఫరా మారిపోయే ప్రమాదం ఉంది. చైనా ఎక్కువ నీటిని నిల్వ చేసి, ఒకేసారి విడుదల చేస్తే, గ్రామాలు లేదా పట్టణాల్లో హఠాత్తుగా వరదలు రావచ్చు. వేసవికాలంలో నీటిని నిల్వ చేయడం వలన, గోదావరి ప్రాంతాల్లో ఎడారు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
నీటిలో అంతరాయం వల్ల భారత రైతులకు సాగునీటి కొరత ఏర్పడుతుంది. ఇది పండ్ల దిగుబడిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ డ్యామ్ నిర్మాణం బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లోని స్థానికుల ఉపాధి మీద ప్రతికూల ప్రభావం చూపించబోతోందని పరిశీలకులు అంటున్నారు. వారు ఆధారపడే సంప్రదాయ జీవన మార్గాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యామ్ పూర్తయినట్లయితే, ఇది చైనా యొక్క శక్తి భద్రతను పెంచడంలో మరియు ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించవచ్చు.


Click it and Unblock the Notifications