Crypto News: క్రిప్టో కరెన్సీలు, వర్చువల్ డిజిటల్ ఆస్తుల విషయంలో కేంద్రం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. దేశంలో సామాన్య ఇన్వెస్టర్లను వీటికి దూరంగా ఉంచేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
డిజిటల్ ఆస్తుల పర్యవేక్షణను కఠినతరం చేసేందుకు కేంద్రం తాజా చర్యగా క్రిప్టో ట్రేడింగ్, సేఫ్టీ సంబంధిత ఆర్థిక సేవలను మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది.

భారత ప్రభుత్వ తాజా గెజిట్ ప్రకారం క్రిప్టో ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తులు ఇప్పుడు తమ క్లయింట్లు, ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల KYCని తప్పక నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను గుర్తించినట్లయితే వాటి వివరాలను సదరు ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియాకు తెలియజేయాల్సి ఉంటుంది. VDAలో వ్యవహరించే సంస్థలు PMLA-బ్యాంకుల క్రింద "రిపోర్టింగ్ ఎంటిటీ"గా పరిగణించబడతాయని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
దేశంలోని ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆభరణాల రంగాల్లో నిమగ్నమైన సంస్థలు, కాసినోలు ఇకపై 'రిపోర్టింగ్ ఎంటిటీలు' అని గెజిట్ ద్వారా వెల్లడైంది. అందువల్ల చట్టం ప్రకారం.. ప్రతి రిపోర్టింగ్ సంస్థ అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఎంటిటీలు కూడా రికార్డులను నిర్వహించటం తప్పనిసరి. బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థలు అనుసరించే విధంగా మనీలాండరింగ్ నిరోధక ప్రమాణాలకు అనుసరించాలని డిజిటల్-ఆస్తి ప్లాట్‌ఫారమ్‌లను వివరాలను అడగటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణికి అనుగుణంగా తీసుకోబడిన నిర్ణయంగా తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications