ఆస్ట్రేలియాకు చెందిన రెండో అతిపెద్ద విమానయాన సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా కుప్పకూలింది. కరోనా మహమ్మారి నష్టాల వల్ల విలవిల్లాడుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్, ప్రజాజీవనం స్తంభించడంతో విమానయాన రంగం సంక్షోభంలో చిక్కుకుపోయింది. వర్జీన్ ఆస్ట్రేలియాకు చెందిన వేలాది మంది ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఈ సంస్థ మరింత మూలధనం కోసం వాలంటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియను ఆశ్రయించింది.

కరోనా దెబ్బకు రుణంలో విఫలం
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దేశాలు లాక్ డౌన్, విమాన సర్వీసులపై నిషేధం విదించడంతో విమాన రంగం చితికిపోయింది. గత నెలలో దాదాపు అన్ని సర్వీసులను రద్దు చేసిన వర్జీన్ ఆస్ట్రేలియా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి దాదాపు రూ.887.60 మిలియన్ డాలర్ల రుణం పొందడంలో విఫలమైంది. దీంతో పరిస్థితి మరింద దిగజారింది.

16,000 ఉద్యోగులపై ప్రభావం
వర్జిన్ ఆస్ట్రేలియా సంస్థ మూతబడితే ప్రత్యక్షంగా 10,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. పరోక్షంగా ఉపాధి పొందుతున్న మరో 6,000 మంది కూడా నష్టపోతారు. ఇప్పటికే కరోనా కారణంగా వేతనం లేని సెలవులు ఇస్తున్నట్లు గత నెలలో వెల్లడించింది. అంతర్జాతీయ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. సిడ్నీ-మెల్‌బోర్న్ మధ్య మాత్రమే సర్వీస్ ఉంది.

ఉద్యోగులకు లేఖ
వర్జీన్ ఆస్ట్రేలియా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు వర్జీనియా గ్రూప్ ఫౌండర్ సర్ రిచర్డ్ బ్రాన్సన్ లేఖ రాశారు. వర్జిన్ ఆస్ట్రేలియా సంక్షోభం తాత్కాలికమేనని, ముగింపు ఉండదని, సరికొత్త ప్రారంభానికి వేదికగా మలుద్దామని పేర్కొన్నారు. కాగా, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి పలువురు సిద్ధంగా ఉన్నారు. దాదాపు పది సంస్థలు ఆసక్తితో ఉన్నాయి.

కొనుగోలుకు ఆసక్తి
వివిధ సంస్థలు కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నాయని, వేలాదిమంది ఉద్యోగులను వదిలివేయమని, కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న సంస్థలను అంచనా వేసేందుకు మూడు వారాలు అవసరమని, మూడు నెలల్లో అన్నీ పూర్తి చేస్తామని లేఖలో పేర్కొన్నారు. కొత్తయాజమాన్యం ఎన్ని మార్గాల్లో, ఎన్ని విమానాలు నిర్వహించగలదనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, వర్జిన్ ఆస్ట్రేలియాను రక్షించేందుకు అతడు తన నెక్కర్ ఐస్‌లాండ్‌ను తనఖా పెట్టే అవకాశాలు పరిశీలిస్తున్నాడు.

అడ్మినిస్ట్రేటర్‌గా డెలాయిట్.. ఏమిటిది?
వర్జీన్ ఆస్ట్రేలియా సంస్థ మరింత మూలధనం కోసం వాలంటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియను ఆశ్రయించింది. అంటే సంక్షోభంలో ఉన్న సంస్థ గట్టెక్కడం కోసం సంస్థను మూసివేయాలా లేదా మరింతకాలం కొనసాగించాలా లేదా పెట్టుబడులు తేవాలా అనే విషయాన్ని తేల్చుకునేందుకు నిపుణులను నియమించుకోవడమే అడ్మినిస్ట్రేషన్. వీరు డైరెక్టర్లు, రుణదాతలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై సూచనలు ఇస్తారు. వర్జీన్ ఆస్ట్రేలియా డెలాయిట్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించుకుంది.


Click it and Unblock the Notifications