ప్రముఖ పెట్టుబడిదారు విజయ్ కెడియా కంపెనీ టాక్ ఇన్ఫోసెక్ లిమిటెడ్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంపెనీ తన ఐపీఓని ప్రారంభించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్‌తో డ్రాఫ్ట్ పేపర్ (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) దాఖలు చేసింది. టాక్ ఇన్ఫోసెక్ ఐపీఓలో రూ.10 ముఖ విలువ కలిగిన 28,29,600 తాజా షేర్లను జారీ చేయనుంది. టాక్ ఇన్ఫోసెక్ ఐపీఓలో సేకరించిన నిధులతో యూఎస్ లోని డెలావేర్‌లో ఉన్న కంపెనీ టాక్ సెక్యూరిటీని కొనుగోలు చేసి దాని అనుబంధ సంస్థగా పని చేస్తుంది.
కంపెనీ తన ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మానవ వనరులు, ఉత్పత్తి అభివృద్ధిలో పెట్టుబడి పెడుతుంది. మిగిలిన మొత్తాన్ని కంపెనీ పనులకు వెచ్చిస్తారు. టాక్ ఇన్ఫోసెక్ అత్యధిక ఆదాయం భారతదేశం వెలుపల ఉన్న మార్కెట్ల నుంచి వస్తుందని కంపెనీ తెలిపింది. ఆ ప్రాంతాలలో బ్రాండ్ బిల్డింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీ తన ఉత్పత్తులను కొనసాగిస్తోంది.

టాక్ ఇన్ఫోసెక్ రిస్క్-బేస్డ్ వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్, సెస్‌మెంట్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ క్వాంటిఫికేషన్, పెనెట్‌రేషన్ టెస్టింగ్‌లను సాస్ మోడల్ ద్వారా ఏదైనా స్కేల్, సైజు, బిజినెస్ సంస్థలకు అందిస్తుంది. బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ గా ఉంది. స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇష్యూకి రిజిస్ట్రార్ గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో టాక్ ఇన్ఫోసెక్ ఆదాయం రూ. 5.31 కోట్లుగా ఉండగా, నికర లాభం రూ. 1.94 కోట్లుగా ఉంది. కాగా, 2022-23లో ఆదాయం రూ.10.14 కోట్లు, నికర లాభం రూ.5.23 కోట్లు.
విజయ్ కిషన్‌లాల్ కేడియా పోర్ట్‌ఫోలియో విలువ రూ.1416.18 కోట్లుగా ఉంది. ఆయన ఫోర్ట్ ఫోలియోలో అతుల్ ఆటో, తేజస్ నెట్‌వర్క్, ఎలికాన్ ఇంజినీరింగ్, వైభవ్ గ్లోబల్, సియారామ్ సిల్క్ వంటి కంపెనీలు ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications