కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు తీసుకువచ్చింది. అయితే ఈ రైళ్లలో ప్రయాణ సౌకర్యాల పరంగా ప్రీమియం అనుభవాన్ని అందిస్తున్నప్పటికీ..టికెట్ రద్దు నిబంధనల విషయంలో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేలా ఉన్నాయి.కొత్త నియమాలను చూసి వందేభారత్ ప్రయాణికులు నోరెళ్లబెడుతున్నారు. రైల్వే బోర్డు తాజాగా ప్రకటించిన ఈ మార్గదర్శకాలు, సాధారణ రైళ్లతో పోలిస్తే మరింత కఠినంగా ఉండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం.. వందే భారత్ స్లీపర్ రైలులో ధృవీకరించబడిన (Confirmed) టికెట్‌ను బుక్ చేసిన తర్వాత ఎప్పుడైనా రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం మొత్తాన్ని రైల్వే శాఖ కట్ చేస్తుంది. అంటే ప్రయాణ తేదీ చాలా ముందే రద్దు చేసినా కూడా పూర్తి రీఫండ్ ఆశించే అవకాశం ఉండదు. ఇక రైలు షెడ్యూల్ బయలుదేరే సమయానికి 72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 50 శాతం రద్దు ఛార్జీ విధించబడుతుంది.

అత్యంత కీలకమైన నిబంధన ఏమిటంటే.. రైలు బయలుదేరే సమయానికి ఎనిమిది గంటల కంటే తక్కువ సమయంలో టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు. గతంలో చాలా రైళ్లకు వర్తించిన నాలుగు గంటల నియమాన్ని తొలగించి.. వందే భారత్ స్లీపర్‌కు ప్రత్యేకంగా ఎనిమిది గంటల పరిమితిని పెట్టారు. కారణం ఏమిటంటే ఈ రైళ్లకు రిజర్వేషన్ చార్ట్‌ను బయలుదేరే ఎనిమిది గంటల ముందే సిద్ధం చేయడం ప్రారంభిస్తారు.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..వందే భారత్ స్లీపర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ లేదా RAC వ్యవస్థ ఉండదు. ప్రయాణికులకు కేవలం ధృవీకరించబడిన టిక్కెట్లే జారీ చేస్తారు. అందువల్ల రద్దు అయిన టిక్కెట్లను మళ్లీ ఇతరులకు కేటాయించే అవకాశం చాలా పరిమితంగా ఉంటుంది. ఈ కారణంగానే రద్దు సమయాన్ని తగ్గించడం, రీఫండ్ మొత్తాన్ని కఠినంగా నియంత్రించడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఇవి ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న Vande Bharat చైర్‌కార్ రైళ్లకూ, సాధారణ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైళ్లకూ వర్తించే నిబంధనలతో పూర్తిగా భిన్నంగా ఉంది. సాధారణ రైళ్లలో, బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఫస్ట్ ఏసీకి రూ.240, టియర్-2 ఏసీకి రూ.200, టియర్-3 ఏసీకి రూ.180, స్లీపర్‌కు రూ.120 మాత్రమే కట్ చేస్తారు. అలాగే 48 నుంచి 12 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం, 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం ఛార్జీ ఉంటుంది. నాలుగు గంటల లోపు రద్దు చేస్తే లేదా TDR దాఖలు చేయకపోతే రీఫండ్ ఉండదు.
అయితే వందే భారత్ స్లీపర్‌లో ఈ సడలింపులు ఏవీ వర్తించవు. ఇక ఛార్జీల విషయానికి వస్తే.. కనీస ఛార్జీ విధించదగిన దూరం 400 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక కోటాలు ఉంటాయి. ఇతర సాధారణ కోటాలు ఈ రైళ్లకు వర్తించవు.
క్లుప్తంగా చెప్పాలంటే వందే భారత్ స్లీపర్ రైళ్లు సౌకర్యాలు, వేగం, భద్రత పరంగా ఆధునికంగా ఉన్నప్పటికీ.. టికెట్ రద్దు విషయంలో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని రైల్వే నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి టికెట్ బుక్ చేసుకునే ముందు ప్రయాణ ప్రణాళిక ఖరారు చేసుకోవడం.. అనవసర రద్దులను నివారించడం ఈ ప్రీమియం రైలులో ఆర్థిక నష్టాన్ని తప్పించుకునే మార్గమని చెబుతున్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications