కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో భారీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక విమానాలను, నౌకలను ఉపయోగిస్తోంది. విమానాల ద్వారా భారతీయుల తరలింపును వందే భారత్ మిషన్, ఓడ ద్వారా తరలింపును సముద్రసేతు ఆపరేషన్‌గా పేర్కొంది. అయితే ఈ తరలింపు కోసం నిర్ణయించిన ఛార్జీలు విదేశాల్లో చిక్కుకుపోయిన చాలామందికి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

భరించలేని ఖర్చు
వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల నుండి వచ్చే వారు తమ ఖర్చును తామే భరించాలి. తిరిగి రావడానికి టిక్కెట్ ఖర్చు, ఇక్కడ హోటల్స్‌లో క్వారంటైన్ ఖర్చు కోసం రూ.లక్షకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది అందరికీ కష్టంగా మారిందని చెబుతున్నారు. విదేశీయులు వచ్చాక ఇక్కడ హోటల్స్‌లలో క్వారంటైన్‌లో 14 రోజులు ఉండాలి. ఉదాహరణకు యూకేలో 6,000 నుండి 8,000 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. విమాన టిక్కెట్ అధికంగా ఉండటంతో పాటు క్వారంటైన్ ఖర్చు మరింత భయపెడుతోంది. ఎంతోమంది అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగాలు కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఖర్చు భరించలేనిదిగా చెబుతున్నారు ఎన్ఐఎస్ఓయూ చైర్ పర్సన్ సనమ్ అరోరా. ఎన్ఐఎస్ఓయూ.. యూకే ఇండియన్ స్యూడెంట్స్ ఆర్గనైజేషన్.

టిక్కెట్స్.. క్వారంటైన్ ఖరీదు
హోటల్ క్వారంటైన్‌లో మూడుపూటలా భోజనానికి రోజుకు రూ.4,000 నుండి రూ.7,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇండియాకు తిరిగి రావడానికి రూ.50,000 వరకు అవుతుందని చెబుతున్నారు. విమాన ఛార్జీలు శాన్‌ప్రాన్సిస్కో, చికాగో తదితర ప్రాంతాల నుండి రూ.1 లక్ష అవుతుంది. లండన్ నుండి ఢిల్లీకి రూ.50వేలు, కువైట్ నుండి హైదరాబాద్‌కు రూ.20వేలు, దుబాయ్ నుండి రూ.35,000 చెల్లించాల్సి వస్తోంది.

టిక్కెట్ ధరలు అధికంగా
టిక్కెట్ ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని, తీసుకు వెళ్లడానికి విమానాలు ఓ ట్రిప్ ఖాళీగా వస్తున్నందున, ఛార్జీలు అధికంగా ఉంటున్నాయని ఢిల్లీ - సిడ్నీ సింగపూర్ ఎయిర్‌లైన్ టిక్కెట్స్ హ్యాండిల్ చేస్తున్న సిడ్నీకి చెందిన అమిత్ శర్మ అన్నారు. అయితే కొంతమందికి ఈ ఖర్చులు అధికంగా మారుతున్నాయి. ఉదాహరణకు మూడు నెలల క్రితం ఓ విద్యార్థి ఉద్యోగం కోసం అబుదబీ వెళ్లాడు. ఏప్రిల్ 7న బెంగళూరు తిరిగి వచ్చేందుకు ఇండిగోలో టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఆ విమానం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అతని వద్ద టిక్కెట్ కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేవు. ఉద్యోగం కోసం వెళ్లి మూడు నెలలే అవుతున్నందున తిరిగి వచ్చేందుకు మరింత చెల్లించలేని పరిస్థితి. టిక్కెట్ ఛార్జీలు అధికంగా ఉన్నందున చాలామంది తిరిగి ఇళ్లకు వెళ్లే అంశంపై ఆందోళనగా ఉన్నారని చెబుతున్నారు.

టిక్కెట్ ఛార్జీ గతంలో చెల్లించినా..
ముంబైకి చెందిన ఓ మహిళ తన కూతురును చూసేందుకు లండన్ వెళ్లారు. మార్చి 29వ తేదీ నుండి ఇంటర్నేషనల్ విమానాలు రద్దు చేయడంతో అక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలల పాటు వీసా పొడిగించుకున్నారు. రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్ కోసం గత ఏడాది బుక్ చేసుకొని, రూ.52,000 చెల్లించారు. ఇప్పుడు వారు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అదనంగా రూ.27,000 చెల్లించాల్సిన పరిస్థితి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications