Year Ender 2023: గుజరాతీలను వెనక్కి నెట్టిన యూపీ.. పూర్తిగా మారిన లెక్కలు..
NSE News: 2023 వాస్తవానికి భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోదగిన ఏడాది. ఈ ఏడాదిలో అత్యధిక స్థాయిలో పెట్టుబడిదారులు బుల్ ర్యాలీ లాభాలను స్వీకరించారు. పైగా అనేక ఐపీవోలు అరంగేట్రం చేశాయి.
దీనంతటికీ అసలు కారణం భారతదేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరగటమే. దేశంలో రిటైల్ ట్రేడింగ్ బూమ్ ప్రస్తుతం కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెల్లడించిన డేటా ప్రకారం ట్రేడింగ్ చేయబడిన ఒప్పందాల సంఖ్య ప్రకారం భారత మార్కెట్లు ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్‌లుగా నిలిచాయి.

అలాగే ఈ ఏడాది భారదేశంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య 8 కోట్ల మార్కును దాటింది. డిసెంబర్ 31, 2022 నుంచి సంఖ్య 22.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డు మైలురాళ్లను సైతం అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును దాటడంతో ఈ ఏడాది ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌పై కూడా ఫోకస్ పెరిగింది.
2023లో ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో కొత్త స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను జోడించింది. రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో గుజరాత్ నిలిచాయి. అలాగే మిజోరం ఏకంగా 55 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌లలో కూడా రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం భారత స్టాక్ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిందని తెలుస్తోంది. దీంతో యూఎస్, చైనా, జపాన్ తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.
ఈక్విటీ డెరివేటివ్‌లలో 74% వాటా, వివిధ అసెట్ క్లాస్‌లలో 61% వాటాతో గ్లోబల్ డెరివేటివ్స్ మార్కెట్‌లో భారతదేశం ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారులు ప్రస్తుతం డెరివేటివ్‌లలో సగటు రోజువారీ టర్నోవర్‌లో 25% కంటే ఎక్కువగా ఉన్నారు. 2023లో 8 మిలియన్లకు పైగా వ్యక్తిగత పెట్టుబడిదారులు ఈ విభాగంలో ట్రేడ్ చేయగా.. అది 2022 గణాంకాల కంటే 30 శాతం అధికం.


Click it and Unblock the Notifications