ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఎలా వాడాలో నేర్చుకుంటున్న వేళ, అమెరికా టెక్సాస్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థ Ignite మాత్రం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ CEO ఎరిక్ వాన్ ఉద్యోగులకు స్పష్టంగా చెప్పారు "AI వాడాలి, లేదంటే ఉద్యోగం వదిలిపోవాలి." మొదట ఈ నిర్ణయం సాధారణంగా అనిపించినా, దాని వెనక పెద్ద కథ ఉంది.

2023 లోనే వాన్ ఒక విషయం గమనించారు. ఆయన అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో AI ని అంగీకరించినవారే నిలబడతారు, మిగతావారు వెనుకబడిపోతారు. కంపెనీ అభివృద్ధి కోసం అందరూ AIని వాడాలని ఆయన నిర్ణయించాడు. కానీ చాలామంది ఉద్యోగులు ఈ ఆలోచనకు సిద్ధం కాలేదు. వాన్ మాటల్లో చెప్పాలంటే, కొత్త స్కిల్స్ నేర్పడం కష్టం కాదు కానీ పాత మైండ్‌సెట్ మార్చడం చాలా కష్టం. ఈ కారణంగా ఏడాదిలోపే సుమారు 80% మంది సిబ్బంది రీప్లేస్ కావాల్సి వచ్చింది.
ఈ క్రమంలో వాన్ కంపెనీలో "AI Mondays" అనే ప్రత్యేకమైన ప్రయోగాన్ని ప్రారంభించాడు. ప్రతి సోమవారం కస్టమర్ కాల్స్, బడ్జెట్ పనులు, సేల్స్ పనులు అన్నీ నిలిపివేసి, అందరూ కేవలం AI ప్రాజెక్టులపైనే పని చేయాలని రూల్ పెట్టారు. దీని కోసం కంపెనీ ఉద్యోగులకు AI కోర్సులు, టూల్స్, ట్రైనింగ్ కూడా అందించింది. కానీ ఆశ్చర్యకరంగా, ఎక్కువ మంది ప్రతికూల స్పందన టెక్నికల్ టీమ్‌లలోనే చూశాం. వారు AI సామర్థ్యాన్ని అంతగా నమ్మలేకపోయారు.
ఉద్యోగులలో ఈ భయం సహజమే. ఒక రీసెర్చ్ ప్రకారం, ముగ్గురిలో ఒకరు AIని ఆఫీస్‌లో వాడటానికి ఇష్టపడటం లేదు. కొందరు AI టూల్స్ వాడటాన్నే నిరాకరించగా, మరికొందరు ఉద్దేశపూర్వకంగా AIతో చేసిన పనిని బలహీనంగా చూపించారు. కారణం ఒక్కటే "AI వాడితే మన ఉద్యోగాలు పోతాయేమో" అన్న భయం.
కానీ IgniteTechలో వాన్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇచ్చాయి. ఆయన కొత్తగా AI Innovation Specialistsని నియమించాడు. ప్రతి డిపార్ట్‌మెంట్ కూడా AI టీంకే రిపోర్ట్ చేసేలా రీ-ఆర్గనైజ్ చేశారు. దీని ఫలితంగా 2024 చివరికి కంపెనీ కొత్త AI ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది, మరో కంపెనీని కొనుగోలు చేసింది, అలాగే లాభాల్లో నిలబడగలిగింది. ముందుగా నెలల తరబడి పట్టే ప్రొడక్ట్స్ ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తవుతున్నాయి.
అయితే, వాన్ పద్ధతిని అందరూ అంగీకరించడం లేదు. ఉదాహరణకు Ikea లాంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం కాకుండా రిస్కిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా మనుషులను రీప్లేస్ చేయడం కన్నా వారిని కొత్త టెక్నాలజీకి అలవాటు చేయడం సస్టైనబుల్ వ్యూహం.
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు AIని తమ వ్యాపారంలో ఎలా వినియోగించుకోవాలో ఇంకా గ్రహిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్‌లోని పెద్ద కంపెనీలు AI విభాగంలో రెండు ప్రధాన వ్యూహాలను అనుసరిస్తున్నాయి రీస్కిలింగ్, రీప్లేస్మెంట్.
కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించడం కంటే, వారిని కొత్త టెక్నాలజీకి అలవాటు చేయడం సరైన మార్గమని భావిస్తున్నాయి. ఉదాహరణకు, Ikea మరియు Accenture లాంటి సంస్థలు ఉద్యోగుల కోసం ప్రత్యేక AI కోర్సులు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, సీనియర్ మరియు జూనియర్ సిబ్బందిని కొత్త AI టూల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్పుతున్నాయి. దీని ద్వారా ఉద్యోగుల నైపుణ్యాలు మెరుగుపడతాయి, వారు కొత్త ప్రాజెక్టుల కోసం సిద్ధంగా ఉంటారు, మరియు సంస్థలో అవుతారు. అలాగే, ఉద్యోగుల మనోబలం కూడా బలపడుతుంది. ఈ విధానం సంస్థకు దీర్ఘకాలిక లాభాన్ని అందిస్తుంది, ఎందుకంటే ఉద్యోగులు కొత్త టెక్నాలజీని అర్థం చేసుకుని, సంస్థలో సానుకూలంగా పనిచేస్తారు.


Click it and Unblock the Notifications